SRI GT PAVITROTSAVAMS FROM SEPTEMBER 16 TO 18 _ సెప్టెంబ‌రు 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

TIRUPATI, 07 SEPTEMBER 2021: The annual Pavitrotsavams in Sri Govindaraja Swamy temple at Tirupati will be observed between September 16 to 18 with Ankurarpanam on September 15.

Every day there will be Snapana Tirumanjanam to the Utsava deities in the morning between 10:30am to 11:30am. However, the entire event will be observed in adherence to Covid guidelines.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 07: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 15న ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా సెప్టెంబరు 16న ఉదయం పవిత్రప్రతిష్ట‌, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 17న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 18న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.