GODDESS ENTHRALLS ON KALPA VRIKSHA VAHANA IN RAJAMANNAR ALANKARAM _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి

Tirupati, 3 Dec. 21: On the fourth day of the ongoing annual Karthika Brahmotsavam of Sri Padmavati Ammavari Temple, Tiruchanoor, Goddess Padmavati blessed devotees in Rajamannar alankaram riding Kalpa Vriksham vahana.

The Vahana Seva was performed in Ekantha as per covid guidelines at the ammavari Vahana Mandapam in the morning and telecast by SVBC channel.

Legends say that Kalpa vriksha created during Samudra mathana relieved hunger and granted memories of past and Goddess riding such an eminent creation became more powerful to redeem all demands of devotees,

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD Board Member Sri Chavireddy Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, temple archaka Sri Babu Swamy, Temple Inspector Sri Rajesh and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి
 
తిరుపతి, 2021 డిసెంబరు 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,   ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.