SOMASKANDA ON KALPAVRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 10 Mar. 21: Sri Somaskanda Murti checkout celestial ride-on Kalpavriksha Vahana on Wednesday morning as a part of ongoing brahmotsavam Sri Kapileswara Swamy temple at Tirupati.

This Vahana Seva held in Ekantham in view of Covid-19 guidelines.

Everyday Snapana Tirumanjanam is performed to between 9am and 11am under the supervision of Kanakana Bhattar Sri Mani Swami.

Temple Deputy Executive Officer Sri Subramanyam and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

శాస్త్రోక్తంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్ర‌తిరోజూ ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) ఏకాంతంగా జ‌రుగుతోంది. కంకణభట్టార్‌ శ్రీ మ‌ణిస్వామి ఆధ్వర్యంలో ఈ క్ర‌తువు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం), ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత  అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ‌వాహ‌నంపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.