CHAKRAASNANAM PERFORMED _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వెంకన్న చ‌క్ర‌స్నానం

Tirupati, 10 Mar. 21: On the last day of the annual brahmotsavams  Chakrasnanam was observed in Ekantam in view of Covid 19 guidelines at Srinivasa Mangapuram on Wednesday.

Earlier the deities were rendered Snapana Tirumanjanam by Kankanabhattar Sri Balaji Rangacharyulu Swami and later Sri Sudarshana Chakrattalwar was given a sacred dip in a huge Vessel placed at the temple amidst chanting of hymns.

Temple Deputy EO Smt.Shanti, AEO Sri Dhananjeyulu, Superintendents Sri Ramanaiah, Sri Chrengalrayulu and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వెంకన్న చ‌క్ర‌స్నానం

తిరుపతి, 2021 మార్చి 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన బుధ‌వారం ఉదయం చ‌క్ర‌స్నానం ఘ‌ట్టం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ముందుగా కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

రాత్రి 7 నుండి 8 గంట‌ల‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.