RAJASTHAN GHOOMAR DANCE CHARMS DEVOTEES DURING KALPAVRIKSHA VAHANA SEVA _ కల్పవృక్ష వాహన సేవలో ఆకట్టుకున్న రాజస్థాన్ ఘూమర్ నృత్యం
551 ARTISTS FROM 8 STATES IN 21 CULTURAL TROUPES
TTD EO HONOURS FOUR BEST-PERFORMING TROUPES
Tirumala, September 18, 2026: Traditional art forms presented by artists from different states during the Kalpavriksha Vahana Seva on Friday morning, the fourth day of the Tirumala Srivari Salakatla Brahmotsavams, delighted devotees.
Organised by TTD’s Hindu Dharma Projects, the cultural performances added grandeur to the vahana seva.
551 Artists from 8 States
A total of 551 artists from 21 troupes representing eight states performed in the Mada Streets of Tirumala.
The performances included Rajasthan Ghoomar, Karnataka Dollu Kunitha and Suggi Kunitha, Maharashtra drum performances, Telangana Bathukamma and Raas-Garba, Uttarakhand folk arts, and Andhra Pradesh Kuchipudi, Chekka Bhajana, Dappu, Jalari and Kolatam, among others.
The vibrant blend of traditional art forms from different states created a colourful cultural atmosphere, while the divine darshan of Sri Malayappa Swamy on the Kalpavriksha Vahana filled devotees with devotion.
EO Honours Four Best Troupes
TTD EO Sri Muddada Ravichandra honoured four best-performing cultural troupes with shawls:
SV Music and Dance College – Sri Balaji Troupe, Bharatanatyam, Puttur, Andhra Pradesh – 23 artists.
Annamacharya Project – Sri Kenchappa Troupe, Suggi Kunitha, Karnataka – 23 artists.
Dasa Sahitya Project – Sri Rahul Mukherjee Troupe, Odissi, Varanasi, Uttar Pradesh – 27 artists.
Hindu Dharma Prachara Parishad – Sri K. Nagaraju Troupe, Dollu Kunitha, Bengaluru, Karnataka – 30 artists.
The cultural performances during the Brahmotsavams are showcasing India’s rich traditions and adding spiritual and cultural grandeur to the celebrations.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
కల్పవృక్ష వాహన సేవలో ఆకట్టుకున్న రాజస్థాన్ ఘూమర్ నృత్యం
8 రాష్ట్రాల నుంచి 21 కళాబృందాలు.. 551 మంది కళాకారుల సాంస్కృతిక సందడి
నాలుగు ఉత్తమ కళాబృందాలకు టీటీడీ ఈవో సన్మానం
తిరుమల, 2026 సెప్టెంబరు 18: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు వాహనసేవకు మరింత శోభను చేకూర్చాయి.
8 రాష్ట్రాల నుంచి 551 మంది కళాకారులు
ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లో 551 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో తిరుమాడ వీధులను కళా వైభవంతో నింపారు.
రాజస్థాన్ ఘూమర్, కర్ణాటక డొల్లు కుణిత, సుగ్గి కుణిత, మహారాష్ట్ర డ్రమ్ విన్యాసాలు, తెలంగాణ బతుకమ్మ, రాస్–గర్భా, ఉత్తరాఖండ్ సంప్రదాయ కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, చెక్కభజన, డప్పు నృత్యం, జాలరి నృత్యం, కోలాటం తదితర కళారూపాలు భక్తులను అలరించాయి.
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళల సమ్మేళనంతో తిరుమాడ వీధులు కళా వైభవాన్ని సంతరించుకోగా, కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళ దర్శనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
నాలుగు ఉత్తమ కళాబృందాలకు ఈవో సన్మానం
వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువతో సన్మానించారు.
– ఎస్వీ సంగీత నృత్య కళాశాల – శ్రీ బాలాజీ బృందం, భరతనాట్యం, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ – 23 మంది.
– అన్నమాచార్య ప్రాజెక్టు – శ్రీ కెంచప్ప బృందం, సుగ్గి కుణిత, కర్ణాటక – 23 మంది.
– దాస సాహిత్య ప్రాజెక్టు – శ్రీ రాహుల్ ముఖర్జీ బృందం, ఒడిస్సీ, వారణాసి, ఉత్తరప్రదేశ్ – 27 మంది.
– హిందూ ధర్మ ప్రచార పరిషత్తు – శ్రీ కె. నాగరాజు బృందం, డొల్లు కుణిత, బెంగళూరు, కర్ణాటక – 30 మంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వివిధ రాష్ట్రాల కళాకారులు అందిస్తున్న ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల











































