KEEP COTTAGES CLEAN ANS SHINING- TTD ADDITIONAL EO _ కాటేజీల‌ను మరింత ప‌రిశుభ్రంగా ఉంచేందుకు చ‌ర్య‌లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 19 July 2021: TTD Additional Executive Officer Sri A V Dharma Reddy directed officials to keep cottages more clean and shining at Tirumala.

After an inspection of the cottages near Padmavati Rest House area on Monday morning, the Additional EO said that a checklist should be maintained at each cottages and officials should check civil and electrical works and cleanliness before allotment. He said all repairs must be completed frequently through AMC (annual maintenance contracts).

During his inspection tour he checked the condition of sofas, Teapoys, toilets etc. in the cottages and suggested to keep bathrooms aromatic and cottages ever clean.

He also directed officials to plug leakages in the rooms and also cut straying branches into rooms and also develop gardens around cottages.

Reception DyEOs Sri Lokanatham, Sri Bhaskar, Health Officer Dr Sunil, DFO Sri Chandrasekhar, Garden Deputy Director Sri Srinivasulu, EEs Sri Srihari, Sri Mallikarjun Prasad and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాటేజీల‌ను మరింత ప‌రిశుభ్రంగా ఉంచేందుకు చ‌ర్య‌లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021, జులై 19: తిరుమ‌ల‌లోని కాటేజీల‌ను మ‌రింత ప‌రిశుభ్రంగా ఉంచేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం ప్రాంతంలోని ప‌లు కాటేజీల‌ను సోమ‌వారం అద‌న‌పు ఈవో త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌తి కాటేజీలో చెక్‌లిస్టు రూపొందించాల‌ని, త‌ద్వారా యాత్రికుల‌కు కేటాయించే స‌మ‌యంలో సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ వ‌స‌తుల‌తోపాటు ప‌రిశుభ్ర‌తాచ‌ర్య‌లు చ‌క్క‌గా ఉండేలా చూడాల‌ని సూచించారు. కాటేజీల‌కు వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుని ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాల‌న్నారు. గ‌దుల్లో ఉన్న సోఫాలు, టీపాయ్‌లు, టాయ్‌లెట్ల‌ను ప‌రిశీలించారు. స్నానపుగదుల్లో చ‌క్క‌టి సువాస‌న వ‌చ్చేలా, కాటేజీ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. గదుల లోప‌ల లీకేజీల‌ను అరిక‌ట్టాల‌ని, అక్క‌డ‌క్క‌డ విరిగిన చెట్ల కొమ్మ‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన చోట్ల సుంద‌రంగా ఉద్యాన‌వ‌నాల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.

అద‌న‌పు ఈవో వెంట టిటిడి వ‌స‌తిక‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇఇలు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.