KODANDARAMA BLESSES ON GAJA VAHANA _ గజవాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అభయం

TIRUPATI, 25 MARCH 2023: On the sixth day evening Sri Kodandarama took out a celestial ride on the majestic Gaja Vahana.

As part of the ongoing annual brahmotsavams in Tirupati, the elephant carrier seva took place with grandeur.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Smt Nagaratna and other office staff, and a large number of devotees participated.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజవాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అభయం
 
తిరుపతి, 2023 మార్చి 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
 
సనాతన హైందవ ధర్మంలో గజ వాహనానికి విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజ దర్బాలలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామికృపకు పాత్రులు అవుతారని ఈ వాహన సేవ తెలుపుతుంది.
 
ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం,ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు.
 
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌,  కంకణభట్టర్‌ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్ శ్రీ చలపతి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.    
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.