REVIEW MEETING ON TUMBURU THEERTHA MUKKOTI HELD BY EO _ ఏప్రిల్ 6న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TIRUMALA, 25 MARCH 2023: With less than two weeks time left for one of the most important torrent festivals in Tirumala, the Tumburu Theertha Mukkoti, TTD EO Sri AV Dharma Reddy held a review meeting with all departments of Tirumala.
The meeting took place at Annamaiah Bhavan on Saturday evening. Directing the officials, the EO said as the Mukkoti is taking place after two year covid restrictions, a considerable increase in the devotees trekking Tumburu Theertham is being anticipated and asked all the officials of TTD to make arrangements accordingly.
The devotees will be allowed for Tumburu Theertham from 6am onwards till 5pm on April 5 and again 5am to 12noon on April 6. Those who have obesity, cardiac problems, other chronic diseases are appealed not to come for trekking.
The EO directed the Engineering, Health, Forest, Medical, Vigilance officials to make arrangements for the big fete without any compromise. “The devotees should be informed not to bring any cooking materials through continuous announcements in Radio and Broad Casting. The Annaprasadam department will supply the “Ready to Eat” food packets which will be distributed at the Papavinasanam Dam to the devotees”, he maintained.
He also instructed the concerned to get ready an ambulance and a team of doctors to meet any exigencies. “Enough number of Srivari Sevaks to be deployed to Annaprasadam, Health, Vigilance departments to provide services to the multitude of visiting pilgrims”, he maintained.
CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Temple Sri Ramesh Babu, Health Officer Dr Sridevi, CMO Dr Muralidhar, DyEOs, EEs, HoDs and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 6న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 25 మార్చి 2023: తిరుమల, 25 మార్చి 2023: తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఏప్రిల్ 5, 6 తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి తాగునీటి కొళాయిలు, మార్గమధ్యంలో రోప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె సమస్యలు, స్థూలకాయం ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళకుండా రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఏఎస్పీ శ్రీ మునిరామయ్య, డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.