GODDESS OF RICHES SITS MAJESTICALLY ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం

Tiruchanoor, 15 Nov. 20: On the fifth day evening during the ongoing nine day annual Karthika Brahmotsavams, Goddess Sri Padmavathi Devi donned “Goddess of Riches-Sri Maha Lakshmi” avatara to bless  Her devotees on Gaja Vahanam.

Seated majestically on Her favourite carrier, the Goddess in all rich, religious splendour mused the devotees who witnessed the Vahana seva live on SVBC since the annual fete is being observed in Ekantam following Covid norms.

The Lakshmi Kasula Haram brought from Tirumala is decked to the Goddess on this auspicious occasion.

TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, TTD Board Member Sri Chavireddy Bhaskar Reddy, CVSO Sri Gopinath Jatti, Suptd of Police Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ దంపతులు, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.