KALYANA VENKANNA RIDES ON GAJA VAHANAM _ గజ వాహ‌నంపై రాజాధిరాజుగా శ్రీ కల్యాణ వెంకన్న

Srinivasa mangapuram, 07 March 2021: On the sixth day of the annual brahmotsavam at Srinivasa Mangapuram on Sunday evening Sri Kalyana Venkateswara took a celestial ride on Gaja vahanam.

Legends hail Gaja, an elephant as a symbol of wealth and prosperity. In the guise of Rajadhiraja, the processional deity blessed His devotees.

DyEO Smt Shanti, AEO Sri  Dhananjayulu, superintendent Sri Ramanaiah, Temple inspector Sri Srinivasulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహ‌నంపై రాజాధిరాజుగా శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2021 మార్చి 07: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి స్వామివారు రాజాధిరాజుగా గజ వాహనంపై అభయమిచ్చారు.

ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.