KAPILESWARA RIDES ON SESHA VAHANAM _ శేష వాహనంపై కపిలేశ్వరుడు

Tirupati, 07 March 2021: On day-4 of the annual Brahmotsavam of Sri Kapileswara temple, Kamakshi sameta Sri Kapileswara Swami rode on Sesha Vahana in Ekantham in view of the Covid guidelines.

Legends say that the entire Seshachala is a transformation of the hoods of Adisesha, the chariot and seat of Maha Vishnu.

DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Inspectors SriReddy Sekhar, Sri Srinivasa Nayak and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శేష వాహనంపై కపిలేశ్వరుడు

తిరుపతి, 2021 మార్చి 07: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.