GARUDA VAHANA SEVA HELD _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వ‌ర‌స్వామివారి రాజ‌సం

TIRUPATI, 14 JUNE 2022: As part of the ongoing annual Brahmotsavams at Appalayagunta, Prasanna Venkateswara took a celestial ride on Garuda Vahana on Tuesday evening.

 

Board member Sri Ashok Kumar, JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వ‌ర‌స్వామివారి రాజ‌సం

తిరుపతి, 2022 జూన్ 14: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.