TIE UP WITH CORPORATE GROUPS FOR GOSAMRAKSHANA SAYS TTD CHAIRMAN _ గోసంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలతో సమావేశం

– MONTHLY DHARMIC PROGRAMS INS SOUTH INDIA

 

– SELF RELIANCE STEPS FOR SVBC 

 

– TTD CHAIRMAN DEPARTMENT REVIEW

 

Tirupati, 2 December 2021: TTD chairman Sri YV Subba Reddy has directed officials to organise a meeting with top corporate groups for supporting TTD Gosamrakshana programs under CSR (Corporate Social Responsibility) campaign.

 

Addressing a meeting of SVGosamrakshana trust, HDPP and SVBC at SVBC office on Thursday night attended by Goshala organisers from AP, Telangana and Chennai, the TTD chairman said TTD will be at forefront to promote Gosamrakshana and Go based Organic farming.

 

He also briefed on the hurdles faced in Maintenance pf Goshala’s, Go based Organic farming and production of Pancha gavya products.

 

He said TTD had organised National Go Maha Sammelan last month to highlight the burning issues in the Go based practices.

 

He directed the officials to organise a meeting with prominent corporate groups from Karnataka Tamilnadu, Telangana and AP to make them partners in the Gosamrakshana campaign.

 

The TTD chairman also advised the officials to conduct district wise awareness campaign onGosamrakshana etc.

 

EXTENSIVE DHARMIC CAMPAIGN

 

He as part of agenda to spread the sanatana Hindu dharma campaign across the country TTD will take up a program to donate a pair of cow &calf to 100 temples in South Indian states of Karnataka, Tamilnadu, Andhra Pradesh and Telangana and asked the TTD board members of those states to shoulder the responsibility.

 

He also asked officials to prepare action plans to conduct the Karthika dipotsavam fete in major cities like Delhi, Mumbai etc. on the lines of the event held at Visakhapatnam on November 29.

 

The TTD chairman also lauded the senior officials of the SVBC channel for its spectacular development activities as the number of devotee viewers had shot upto Two crores.

 

He said instructed TTD officials to make plans to popularise the Kannada and Hindi version of SVBC launched by the AP Chief Minister Sri YS Jaganmohan Reddy in October last.

 

He said by attracting donations the agenda of TTD was to make the channel self-reliant.

 

TTD board members Sri Vishwanath, Sri M Sriramulu, Sri Vidyasagar.Smt Malleswari, SVBC chairman Sri Sai Krishna Yachendra, JEO Sri Veerabrahmam, FA& CAO Sri O Balaji, SVBC CEO Sri Suresh Kumar, SV Goshala director Dr Harikatha Reddy, Coordinator of Dharmic programs Sri Vijay Sarsthi, HDPP secretary Sri Rama Rao and others were Present. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గోసంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలతో సమావేశం
– ఇకపై దక్షిణ భారతదేశంలో ప్రతినెల ధార్మిక కార్యక్రమాలు
– ఎస్వీబీసీ స్వయం సంవృద్ధికి చర్యలు
 
శాఖల సమీక్ష లో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
తిరుపతి 2 డిసెంబరు 20 21: గో సంరక్షణ శాలల అభివృద్ధికి  కార్పొరేట్ సంస్థల సహకారం కోరడానికి  నెలరోజుల లోపు సమావేశం ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
 
పరిశ్రమల సామాజిక బాధ్యత ( సిఎస్ఆర్) కింద గోశాల నిర్వహణ,  గో సంరక్షణకు  తోడ్పాటు అందించేలా కార్పొరేట్ సంస్థలకు అవగాహన కల్పించాలని  చెప్పారు.
   
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో గురువారం రాత్రి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్,  ఎస్వీబీసీ  అధికారులతో చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,చెన్నై ప్రాంతాల నుంచి పలువురు గోసంరక్షణ శాల నిర్వాహకులు హాజరయ్యారు. గోశాల నిర్వహణ, గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ వాటి మార్కెటింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను వారు చైర్మన్ కు వివరించారు.
 
గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయంప్రోత్సహించడానికి టిటిడి ముందు వరుసలో ఉంటుందని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే గత నెలలో తిరుపతిలో జాతీయ గో మహాసమ్మేళనం  నిర్వహించామన్నారు. ఇందుకు కొనసాగింపుగానే  గోశాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి  వారి ఇబ్బందులు, సమస్యల గురించి తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. తమిళనాడు , కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల యజమానులతో నెలలోపు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు తగిన తీసుకోవాలని అధికారులకు సూచించారు.
           
హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత ఉదృతంగా చేయడం కోసం  దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత  పథకం కింద 100 ఆలయాలకు గోవు, దూడలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పాలక మండలి సభ్యులకు ఇందుకు సంబంధించిన భాద్యతలు అప్పగించారు.  గత నెల 29వ తేదీ విశాఖపట్నంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రతి నెల దక్షిణ భారతదేశంతో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో  ఎక్కడో ఒక  చోట పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను
ఆదేశించారు.
   
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ గత రెండేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని ఛానల్ ఉన్నతాధికారులు సిబ్బందిని చైర్మన్ అభినందించారు. రెండు  సంవత్సరాల క్రితం వీక్షకుల సంఖ్య కోటి ఉంటే , ఇప్పుడా సంఖ్య ఏడు కోట్లకు పెరిగింద న్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ముఖ్యమంత్రి  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన కన్నడ, హిందీ ఛానళ్లను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రణాళికలుతయారు చేయాలన్నారు. ఎస్వీబీసీని విరాళాల సేకరణ ద్వారా స్వయం సమృద్ధిగా తయారుచేసి సొంత కాళ్లపై నిలబడేలా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని శ్రీ  సుబ్బారెడ్డి చెప్పారు.
     
ఈ సమావేశాల్లో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ విశ్వనాథ్,  శ్రీ మురం శెట్టి రాములు, శ్రీవిద్యాసాగర్, శ్రీ మల్లీశ్వరి,ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర,  జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎ సి ఏ వో శ్రీ బాలాజి, ఎస్వీబీసీ సిఈవో శ్రీసురేష్ కుమార్,  ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ కర్త శ్రీ విజయ సారథి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.