GODDESS BLESSES IN YOGA NARASIMHA ALANKARAM ON SHIMA VAHANA _ సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో లోకమాత

Tirupati, 2 December 2021: On the third day of Karthika Brahmotsavam, Goddess Padmavati enthralled the devotees by riding Simha vahana in Yoga Narasimha Swami alankaram, held in Ekantha as per covid guidelines.

 

Simha was a symbol of bravery, speed and agility and by riding it Goddess blessed devotees with wealth, success, stamina, wisdom and servitude.

 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD Board Member Sri Chavireddy Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, temple archaka Sri Babu Swami, Temple Inspector Sri Rajesh and other officials were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో లోకమాత
 
తిరుపతి, 2021 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, తిరుమల విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.