ALL TTD PROJECTS SHOULD TAKE DHARMA PRACHARA TO GRASS ROOT LEVEL-TTD EO _ గ్రామ‌స్థాయికి ధార్మిక కార్య‌క్ర‌మాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి

TIRUPATI, 08 JULY 2021: All projects in TTD should take up their dharmic activities to the village level and enlighten the youth about the great tenets of Sanatana Hindu Dharma, said TTD EO Dr KS Jawahar Reddy.

A review meeting was held with the heads of All Dharmic Projects of TTD in EO’s chamber in TTD Administrative Building in Tirupati on Thursday. Speaking on the occasion, the EO said, the essence of Vedas and our epics should reach a common man and arrangements shall be planned accordingly.

EO directed for constituting Dharmic Committees to take Dharma Prachara programmes in an extensive manner at the village level. Following the advice of the Committee, devotional programmes shall be planned at the Village level to take forward Dharmic activities, he said. 

A calendar of events shall be chalked out by each project to take forward dharmic programmes in an effective manner at the village level in coordination with district administration of the respective areas. 

He said the Experts Committee needs to be constituted in every project and research shall be taken in a big way. All the project offices should be situated in one building for administrative convenience and directed officials to identify an appropriate place for the same.   

The details of Dasaparas, Bhajana Artists, Srivari Sevakulu and other voluntary personnel shall be collected and all of them to be involved in the Dharmic activities of TTD, he suggested.

For the benefit of the society, there is a dire need to extensively propagate our Vedas. The present figures of 1400 Veda Parayanamdars who are available across the country need to be enhanced so that Dharmic activities shall be taken up in a massive way across the villages, the EO felt.

Additional EO Sri AV Dharma Reddy, SVBC CEO Sri Suresh Kumar, IT Chief Sri Sesha Reddy, Heads of All Dharmic Projects of TTD were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ్రామ‌స్థాయికి ధార్మిక కార్య‌క్ర‌మాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి

తిరుపతి, 2021 జులై 08: టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల కార్య‌క్ర‌మాల‌ను గ్రామ‌స్థాయికి తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో గురువారం ఆయ‌న టిటిడిలోని ధార్మిక ప్రాజెక్టుల కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సామాన్య ప్ర‌జ‌ల‌కు కూడా వేదాల సారం అర్థ‌మ‌య్యేలా గ్రామాల్లోని దేవాల‌యాల్లో ఏర్పాటుచేసిన మైక్‌సెట్ల‌ను ఉప‌యోగించుకుని వేద‌పారాయ‌ణాలు జ‌రిపించాల‌ని చెప్పారు. ఇందుకోసం గ్రామ‌స్థాయిలో ధ‌ర్మ‌ప్ర‌చార క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. స‌నాత‌న హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఆ క‌మిటీల సూచ‌న‌లు, సిఫార్సుల మేర‌కు కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న చేసి వాటిని అమ‌లు చేయాల‌న్నారు. ధార్మిక ప్రాజెక్టులు ఏ రోజు ఏ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలో క్యాలెండ‌ర్ రూపొందించాల‌ని ఈవో సూచించారు. ధార్మిక ప్రాజెక్టులు గ్రామ‌స్థాయిలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం చేయ‌డానికి జిల్లా యంత్రాంగం స‌హ‌కారం తీసుకోవాల‌ని ఈవో అధికారుల‌కు సూచించారు.

ప్ర‌తి ప్రాజెక్టులో నిపుణుల క‌మిటీ ఏర్పాటుచేసి ఆయా ప్రాజెక్టుల‌కు సంబంధించిన ప‌రిశోధ‌నలు జ‌ర‌గాల‌ని చెప్పారు. టిటిడికి సంబంధించిన అన్ని ప్రాజెక్టుల కార్యాల‌యాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాస‌సాహిత్య, హెచ్‌డిపిపి భ‌జ‌న మండ‌ళ్లు, శ్రీ‌వారి సేవ‌కులు ఇత‌ర వాలంటీర్ల వివ‌రాలు త‌యారుచేసి ధార్మిక కార్య‌క్ర‌మాల్లో వీరిని భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు.  స‌మాజ హితం కోసం వేద వ్యాప్తి జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని, ఇందుకోసం దేశ‌వ్యాప్తంగా ఉన్న 1400 మంది వేద‌పారాయ‌ణ‌దారుల సంఖ్య మ‌రింత పెంచి గ్రామ గ్రామాల్లో ప్ర‌తిరోజూ వేదం వినిపించేందుకు కృషి చేయాల‌న్నారు. స‌ప్త‌గిరి మాస‌ప‌త్రికపై స‌మీక్షించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య దక్షిణామూర్తి, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. చొక్క‌లింగం, క‌ల్యాణం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ గోపాల్‌, డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి శ్రీ రామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.