YUDDAKANDA PARAYANAM TO CONCLUDE ON JULY 10 _ జూలై 10న ముగియనున్న యుద్ధ‌కాండ పారాయ‌ణం

TIRUMALA, 08 JULY 2021: The month-long Yuddhakanda Parayanam which commenced on June 11 at Vasantha Mandapam in Tirumala is set to conclude in July 10.

A total of 32 Vedic Pundits with 16 members each at Vasantha Mandapam and Dharmagiri have been performing Yuddhakanda Parayanam. While the Vedic scholars are chanting shlokas from Yuddhakanda in Vasantha Mandapam, the Ritwiks are performing Japa and Homam in Dharmagiri. The noble intention behind this programme is to get rid off the dreadful corona Covid 19 virus from the world through the chanting of powerful slokas.

On July 6, the Ravana Samhara Ghattam was recited as a part of this programme which won the accolades from global devotees. Every day this programme is being telecasted live on SVBC from 8:30am onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 10న ముగియనున్న యుద్ధ‌కాండ పారాయ‌ణం

తిరుమల, 2021 జూలై 08: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన రామ‌యంణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణం జూలై 10న శ‌నివారం ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 11న ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభమైంది.

” స‌కృదేవ ప్ర‌ప‌న్నాయ‌త వాస్మీతి చ‌యాచ‌తే అభ‌యం స‌ర్వ‌భూతేభ్యః ద‌దామ్యే త‌ద్వ్ర‌తం మ‌మ‌ ” మ‌హామంత్రం ప్రకారం యుద్ధ‌కాండ‌లోని మొత్తం 131 స‌ర్గ‌లలో 5783 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.