PLAVANAMA SAMVATSARA UGADI CELEBRATIONS ON APRIL 13 _ గ్రామ‌స్థాయి నుండి ధ‌ర్మ‌ప్ర‌చారానికి ప్ర‌ణాళిక‌లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 2 Apr. 21: Sri Plavanama Samvatsara Ugadi festival will be observed at different places including Asthanam at Srivari temple in Tirumala on April 13 said TTD EO Dr KS Jawahar Reddy.

Before taking the calls from pilgrim callers as part of the monthly Dial your EO programme held at Conference Hall in TTD Administrative Building in Tirupati on Friday, the EO said, Asthanam followed by Panchanga Sravanam will be observed on the auspicious occasion of Telugu Ugadi on April 13.

He said, TTD is also organising Ugadi festivities at the Mahati auditorium and also at SV Vedic University premises on that day.

Briefing on other important programmes in Tirumala in the month of April he said, annual Vasantothsavam at Srivari temple will be observed from April 24-26 besides observing Sri Tallapaka Annamacharya Vardhanti on April 8, Sri Rama Navami Asthanam at Srivari temple on April 21, Sri Rama Pattabhisheka Asthanam at Srivari temple on April 22.

In the background of the COVID-19 surge once again, TTD has slashed Sarva Darshan time slot tokens from 22,000 to 15,000 in the best Heath safety of devotees and appealed to devotees to wear masks, sanitisers and observe social distancing without fail to prevent the spread of Covid.

As part of its mission of Hindu Dharma Prachara, TTD has decided to organise Chaitra masa dharmic programs in a big way on the lines of its religious programs held during Karthika, Dhanur, Magha and Phalguna months.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

గ్రామ‌స్థాయి నుండి ధ‌ర్మ‌ప్ర‌చారానికి ప్ర‌ణాళిక‌లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి 

తిరుమల, 02 ఏప్రిల్‌ 2021: గ్రామ‌స్థాయి నుండి స‌నాత‌న హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని విస్తృతం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని, ఇందుకోసం భ‌జ‌న‌మండ‌ళ్లు, గోశాల నిర్వాహ‌కులు, విష్ణుస‌హ‌స్ర‌నామ‌, ల‌లితాస‌హ‌స్ర‌నామ మండ‌ళ్లు, శ్రీ‌వారి సేవ‌కుల వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో శుక్ర‌వారం జ‌రిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా ఈవో భ‌క్తుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి : 

–       కోవిడ్ వ్యాప్తి మ‌ళ్లీ పెరుగుతున్నందున శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాలి. స‌మ‌యానుసారం శానిటైజ‌ర్ వినియోగించాలి. మాస్కులు లేని భ‌క్తుల‌కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వ‌ద్ద మాస్కులు అందించే ఏర్పాటు చేస్తాం.

బ‌స : 

–       ఆన్‌లైన్‌లో గ‌దులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భ‌క్తులు మొద‌ట సిఆర్వో కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డినుండి స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యానికి చేరుకుని గ‌దులు పొందుతున్నారు. యాత్రికులు తిరుప‌తిలో అలిపిరి చెక్‌పాయింట్ దాట‌గానే ఎస్ఎంఎస్ ద్వారా స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యం వివ‌రాలు తెలియ‌జేస్తాం. త‌ద్వారా యాత్రికులు నేరుగా స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొందే సౌల‌భ్యం క‌ల్పిస్తాం. రానున్న 10 రోజుల్లో ఈ విధానం అమ‌ల్లోకి రానుంది.

–      ఆన్‌లైన్‌లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు అదే స్క్రీన్‌లోనే గ‌దులు బుక్ చేసుకునేందుకు వీలుగా టిటిడి వెబ్‌సైట్‌లో మార్పు చేస్తున్నాం.

కాల్ సెంట‌ర్ :

–        కాల్ సెంట‌ర్‌ను ప‌టిష్టం చేసి యాత్రికులకు వేగ‌వంతంగా స‌మాచారం అందించే ఏర్పాట్లు చేప‌ట్టాం. ఇందుకోసం సిబ్బంది సంఖ్య‌ను 8 నుండి 15 మందికి పెంచాం. కాల్ సెంట‌ర్ టోల్‌ఫ్రీ నంబ‌రులో అంకెల‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.

–        ఫిర్యాదు చేసిన యాత్రికుల స‌మస్య‌ను ప‌రిష్క‌రించిన అనంత‌రం తెలియ‌జేసేందుకు వీలుగా ఐవిఆర్ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెడ‌తాం.

ఉగాది  :

– ఏప్రిల్‌ 13వ తేదీన తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా టిటిడి పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.

–       తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పంచాంగశ్రవణంతో పాటు ఉగాది సంబరాలు నిర్వహిస్తాం.

ఏప్రిల్‌ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాల‌కట్ల  వసంతోత్సవాలు  :

– ఈ నెల‌ 24 నుండి 26వ తేదీ వరకు తిరుమల‌లోని వసంత మండపంలో శ్రీవారి సాల‌కట్ల వసంతోత్సవాల‌ను నిర్వహిస్తాం.

– ఏప్రిల్‌ 25వ తేదీ ఉదయం 8.00 నుండి 9.00 గంటల‌ వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తుల‌కు దర్శనం ఇస్తారు.

తిరుమల‌లో ఉత్సవాలు :

– ఏప్రిల్‌ 8న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.

– ఏప్రిల్‌ 21న శ్రీవారి ఆల‌యంలో శ్రీరామనవమి ఆస్థానం.

– ఏప్రిల్‌ 22న శ్రీవారి ఆల‌యంలో శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాల‌యం :

– వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాల‌యంలో ఏప్రిల్‌ 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 26న శ్రీ సీతారాముల‌ కల్యాణం జరుగనుంది.

టిటిడి స్థానిక ఆల‌యాల‌లో బ్రహ్మోత్సవాలు :

– ఏప్రిల్‌ 16 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం.

– ఏప్రిల్‌ 26 నుండి మే 4వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం.

– లోక కల్యాణార్థం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఎస్వీబీసీ ద్వారా నిర్వహించిన కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణమాస ఉత్సవాల‌కు భక్తుల‌ నుండి విశేషాదరణ ల‌భించింది.

ఫాల్గుణ‌ మాస ఉత్సవాలు :

– మార్చి 14 నుండి నెల‌ రోజు పాటు ఉదయం 6 నుండి 6.40 గంటల‌ వరకు తిరుమల‌ నాదనీరాజనం వేదికపై ఫాల్గుణ‌ మాసం – ల‌క్ష్మీ వైభవం పేరిట ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

– మార్చి 19న ఫాల్గుణ శుద్ధ షష్ఠినాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యంలోని ధ్యానారామంలో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు మృల్లింగార్చన నిర్వహించాం.

– మార్చి 24న ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాయంలోని ధాత్రీవనంలో ఉదయం 9 నుండి 10 గంట వరకు ఆమల‌కీ ఏకాదశి నిర్వహించాం.

– మార్చి 28న ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని టిటిడి పరిపాల‌నా భవనం పరేడ్‌ మైదానంలో ఫాల్గుణ ల‌క్ష్మీ వైభవం – ల‌క్ష్మీ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించాం. ఇందులో 1000 మందికిపైగా మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

– ఏప్రిల్‌ 4న ఫాల్గుణ బహుళాష్టమి నాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యంలోని ధ్యానారామంలో ఉదయం 10 నుండి 11 గంటల‌ వరకు శీతలాష్టమి(శీతలాదేవ్యర్చనం) నిర్వహిస్తారు.

– అదేవిధంగా చైత్ర మాసంలో…

– ఏప్రిల్‌ 13న ఉగాది నాడు పంచాంగ పూజ – పఠనం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యంలో గల‌ యాగశాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు నిర్వహిస్తాం.

– ఏప్రిల్‌ 14న చైత్ర శుద్ధ తదియ మత్స్యజయంతి (మత్స్యరూప ల‌క్ష్మీనారాయణ పూజ) తిరుమల‌లోని వసంత మండపంలో ఉదయం 11 నుండి 12 గంటల‌ వరకు నిర్వహిస్తాం.

– ఏప్రిల్‌ 18న చైత్ర శుద్ధ షష్ఠి కుమార వ్రతము తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగశాల‌లో ఉదయం 10 నుండి 11 గంటల‌ వరకు నిర్వహిస్తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.