ANNAMAIAH VARDHANTI POSTER RELEASED _ శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 518వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
Tirupati, 2 Apr. 21: The 518th Death Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya was released by TTD Dr KS Jawahar Reddy on Friday.
After the Dial your EO programme held at Conference Hall in TTD Administrative Building, the EO along with Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti released the poster.
Annamacharya Project Director Sri Dakshinamurthy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 518వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
తిరుపతి, 2021 ఏప్రిల్ 02: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 518వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనాభవనంలోని సమావేశ మందిరంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు.
అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించనున్నారు. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
కాగా, ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 6.00 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. ఏప్రిల్ 8న తిరుమలలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.
అదేవిధంగా ఏప్రిల్ 8 నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు, పండితులు పాల్గొననున్నారు. అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం, 9, 10వ తేదీల్లో ఉదయం 10.30 నుండి సాహితీ సదస్సు జరుగనుంది.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ దక్షిణమూర్తి శర్మ పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.