“SACRED SEEDS SOWN” FOR ANNUAL BTU AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 13 Feb. 20: Ahead of the annual Brahmotsavams beginning from February 14 onwards in the famous Lord Shiva temple of TTD at Sri Kapileswara Swamy temple, the traditional seed sowing fete, Ankurarpanam was observed in a religious manner on Thursday evening.

Earlier Veedhi utsavam was conducted to the utsava idol of Sri Vinayaka Swamy.

Meanwhile, TTD had rolled out all preparations including rangoli, floral and electrical decorations, barricades and additional security with vigilance, Police Srivari Sevakulu and scouts were drafted at the temple. 

Nearly four tons of flowers including traditional and ornamental are indented for use in nine days of Brahmotsavams along with electrical illumination.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi, temple inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik and other officials participated in Ankurarpanam fete.

 

Following are the schedule of vahanams of the Brahmotsavams.

14-02-2020(Friday) Dwajarohanam           in kumbha lagnam Pallaki utsavam and Hamsa vahanam

15-02-2020(Saturday) Surya Prabha and Chandra Prabha vahana 

16-02-2020(Sunday) Bhoota vahanam and Simha vahanam

17-02-2020(Monday) Makara and Sesha Vahanams 

18-02-2020(Tuesday) Tiruchi utsavam and Adhikara Nandi vahanam

19-02-2020(Wednesday) Vyaghra vahanam ans Gaja vahanam

20-02-2020(Thursday) Kalpavruksha and Aswa Vahanam 

21-02-2020(Friday) Rathotsavam and Nandi vahanam on the day of Maha Sivarathri

22-02-2020(Saturday) Purusha Mruga, Kalyanotsavam and Tiruchi utsavam 

23-02-2020(Sunday) Ravanasura vahanam of Nataraja, Surya Prabha Trishul snanam and Dwajavarohanam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 తిరుపతి, 2020 ఫిబ్రవరి 13: తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించారు. సాయంత్ర 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.

ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
      

      ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ఉదయం 8.04 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.
     
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
 
ఆకట్టుకునేలా అలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 4.5 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
       
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌,  శ్రీ శ్రీ‌నివాస‌నాయ‌క్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                  ఉదయం                                  సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం(కుంభలగ్నం)       హంస వాహనం

15-02-2020(శ‌నివారం)    సూర్యప్రభ వాహనం            చంద్రప్రభ వాహనం

16-02-2020(ఆదివారం)    భూత వాహనం                  సింహ వాహనం

17-02-2020(సోమ‌వారం)   మకర వాహనం                శేష వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్సవం            అధికారనంది వాహనం

19-02-2020(బుధ‌వారం)       వ్యాఘ్ర వాహనం         గజ వాహనం

20-02-2020(గురువారం) కల్పవృక్ష వాహనం            అశ్వవాహనం

21-02-2020(శుక్ర‌వారం)    రథోత్సవం(భోగితేరు)           నందివాహనం

22-02-2020(శ‌నివారం)      పురుషామృగవాహనం         కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం  

23-02-2020(ఆదివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం.          ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.