CHANDRAPRABHA VAHANA SEVA HELD _ చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

TIRUPATI, 05 APRIL 2022: Chandra Prabha Vahana Seva was observed in Sri Kodanda Rama Swamy Brahmotsavam on the seventh day evening.

The processional deity of Sri Rama was taken along four Mada streets to bless His devotees.

Senior and Junior Pontiffs of Tirumala, spl Gr DyEO Smt Parvati and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 05: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 10  గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ జరుగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నాడు.
 
పరదాలు విరాళం
 
హైదరాబాద్‌కు చెందిన శ్రీ సంజయ్, శ్రీమతి ప్రసన్నారెడ్డి దంపతులు  తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయానికి రూ.2 లక్షలు విలువైన  పరదాలు, కురాళాలు విరాళంగా సమర్పించారు.
 
వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.