ANNUAL FESTIVAL CONCLUDES WITH CHAKRASNANAM _ చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 27 Jun. 21: The annual nine-day festival concluded with Chakrasnanam at Appalayagunta on Sunday.

 Due to Covid restrictions, instead of performing the fete in Pushkarini, the Archakas performed the same in a huge Gangalam inside temple premises itself after performing Snapana Tirumanjanam to deities and Sudarshana Chakram.

 Deputy EO Smt Kasturi Bai, Chief Priest and Kankana Bhattar Sri Surya Kumar Acharyulu, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopala Krishna Reddy were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 జూన్ 27: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వ‌హించారు.

ఉద‌యం 8.30 నుండి 10.15 గ‌టంల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

కాగా రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.