GOVINDARAJA SWAMY RIDES CHINNA SESHA VAHANA _ చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం 

Tirupati,27 May 2023: As part of the ongoing annual Brahmotsavams Sri Govindarajaswami took ride on the Chinna Sesha vahanam on the second day on Saturday morning and blessed the devotees.

The grand vahana procession led by Elephants, chakka bhajans, Kolatam teams, Mangala Vaidyam was a cynosure for devotees. 

Thereafter the divine Snapana Tirumanjanam was performed to utsava idols of Sri Govindarajaswami and His consorts Sri Devi and Bhudevi.

Both the Tirumala pontiffs, Kankana Bhattar Sri Srinivasa  Dikshitulu, DyEO Smt Shanti, AEO Sri Ravi Kumar, Superintendent and others, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
 
తిరుప‌తి 2023 మే 27: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
 
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభ‌వంగా జరిగింది.
 
చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించారు.
 
ఐదు తలల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు. 
   
అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
 
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, కంకణ భట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్  శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.