TTD EO INSPECTS SRI PAT DEVELOPMENT WORKS _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో
Tirupati, 27 May 2023: TTD EO Sri AV Dharma Reddy on Saturday inspected the ongoing development works at Sri Padmavati temple in Tiruchanoor and made some valuable suggestions.
The EO directed officials to construct a stone mandapam in place of Yagashala and Ayina Mahal inside the temple complex.
Among others, he instructed them to shift the electric control room to outside in consultation with the APSPDCL and replace the old shed with modern sheds with, new compound wall to cover the ghee tank, flour mill, electric generator etc in Friday Gardens.
He also instructed the officers to study the feasibility of building a new waiting complex for devotees in place of the old one and submit a report soon.
Earlier he also inspected other development activities in the temple complex including the four Mada streets, flour mill, gas storage, hot water plant and Tolappa Gardens.
TTD JEO Sri Veerabrahmam, FA &CAO Sri Balaji, CE Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateshwarlu (electrical), DyEO Sri Govindarajan, TTD technology advisor Sri Ramachandra Reddy, EE Sri Manoharam, AEO Sri Prabhakar Reddy were also present.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో
తిరుపతి, 2023 మే 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయంలో ప్రస్తుతం ఉన్న ఐనామహల్, యాగశాలల స్థానంలో రాతి మండపం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఆలయంలో ఉన్న ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్ ను ఆలయం బయటకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఎస్పీ డీసీఎల్ అధికారుల సూచనలు తీసుకోవాలన్నారు. ఆలయంలో ఉన్న రేకుల షెడ్డు స్థానంలో వెలుతురు బాగా వచ్చేలా ఆధునిక షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారపు తోటలో ఆధునీకరణ పనులు చేపట్టి నెయ్యి ట్యాంకు, పిండి మిల్లు, ఎలక్ట్రికల్ జనరేటర్, ఒకవైపు ఉండేలా అవసరమైన ప్రహరీ గోడను నిర్మించాలని సూచించారు. శుక్రవారపు తోటలో ఉన్న పురాతన బావి మరమత్తు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు, విద్యుత్ వైర్లను వెలుపలకు మార్చాలని ఆదేశించారు. శుక్రవారపు తోటలోని కోనేటి మండపానికి మరమ్మత్తులు చేసి అమ్మవారి
ఊంజల సేవ నిర్వహించాలని ఈవో ఆదేశించారు.
యాత్రికులు వేచి ఉండేందుకు పాత డిప్యూటీ ఈవో కార్యాలయ భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి సాధ్యా సాధ్యాలను పరిశీలించి, సమగ్ర నివేదికను రూపొందించాలని చెప్పారు . ఆ తరువాత దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఈవో ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పోటు, ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్, శుక్రవారం తోటలోని నెయ్యి ట్యాంక్, ఫ్లోర్ మిల్, గ్యాస్ నిల్వ గది, హాట్ వాటర్ ప్లాంట్, నాలుగు మాడ వీధులు, తోలప్ప గార్డెన్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎ సీఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ లు శ్రీ సత్యనారాయణ , (ఎలక్ట్రికల్ )శ్రీ వెంకటేశ్వర్లు, టీటీడీ సాంకేతిక సలహాదారు శ్రీ రామచంద్రా రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఈఈ శ్రీ మనోహర్, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.