TTD CHAIRMAN INSPECTS DIVYAKSHETRA SITE AT JAMMU _ జమ్మూ లో దివ్యక్షేత్రం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్

Tirupati, 26 Aug. 20: The Chairman of TTD Trust Board, Sri Y V Subba Reddy on Wednesday inspected the location site at Jammu proposed for the construction of Sri Venkateswara Temple (Divya Kshetra).

The Jammu and Kashmir Government has come forward to allocate suitable land towards the construction of the Srivari temple, which was already approved by the TTD board.

The Chairman informed the local officials that a team of officials from the Engineering Department of TTD would soon visit the site and prepare a detailed report.

The Jammu District collector, Smt Sushma Chauhan, District Additional Development Commissioner Sri Ramesh Chander, Additional Deputy Commissioner Sri Shyam Singh, Assistant Commissioner-General Sri Rakesh Dube, Mata Vaishnodevi temple CEO Sri Ramesh Kumar and Additional CEO Sri Vivek Varma accompanied the TTD Chairman during the site inspection.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జమ్మూ లో దివ్యక్షేత్రం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్.                                

తిరుపతి , 2020  ఆగ‌స్టు 26.: జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. 

అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్ముకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలనిఆదేశిస్తామని చైర్మన్ అక్కడి అధికారులకు తెలిపారు. 
    
జమ్మూ కలెక్టర్ శ్రీమతి సుష్మా చౌహాన్, జిల్లా అభివృద్ధిఆదనపు కమిషనర్ శ్రీ రమేష్ చందర్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్రీ శ్యాం సింగ్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్  శ్రీ రాకేష్ దూబే, శ్రీ వైష్ణోదేవి ఆలయ బోర్డ్ సిఈఓ శ్రీ రమేష్ కుమార్, అదనపు సిఈఓ శ్రీ వివేక్ వర్మ చైర్మన్ వెంట ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.