REVIEW MEETING ON COVID PANDEMIC HELD _ క‌రోనా ప‌రిస్థితుల‌పై టిటిడి ఈవో స‌మీక్ష

Tirupati, 26 Aug. 20: To assess the COVID pandemic situation in Tirumala Tirupati Devasthanams, so as to avoid further spread of the deadly virus among employees of TTD with timely measures, a review meeting was held by EO Sri Anil Kumar Singhal along with District Collector Sri Bharat Narayan Gupta and other authorities of TTD in the Conference Hall of TTD Administrative Building on Wednesday evening.

During the review meeting, the EO said that the overall trend of the incidence of Corona cases amongst the TTD employees and also in Tirupati Municipal Corporation limits is favourable and considerable reduction in the cases has been noticed. The occupancy rate in Rest Houses turned COVID Care Centres including Madhavam, Srinivasam and Vishnunivasam have also come down as many rooms in the rest houses are lying vacant, he added. 

The EO said, amongst the TTD employees who are tested so far, only 69 are undergoing treatment and their condition is also stable. However, for the 2500 FMS and Outsourcing employees who are working in Tirumala are yet to be tested. “By carrying out 200 RTPCR and 300 Rapid Antigen Tests each day we can complete the tests to all of them in the next five days”, the EO said. The Collector agreed to send the mobile van to Tirumala to complete the tests within the stipulated time.

The Collector also stated that the tests have also been increased across the district and said the Positive Rate is reduced. The present status of the procurement of the COVID equipment and kits with the financial aid being provided by TTD to District Administration was also reviewed.  

The EO also reviewed the Medical waste including the PPE kits, Mask, Gloves etc. in the premises of COVID Hospitals and Rest Houses turned COVID centres. The Collector said the Medical wastes accumulated near the COVID care centres and hospitals are being segregated from food waste and removed on a regular basis.  The EO instructed TTD Health Wing officials to ensure that appropriate action in connection with any Medical waste if any available at Tirumala should be taken immediately.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, Joint Collector Sri Veerabrahmam, Assistant Collector Sri Vishu Charan, Additional CVSO Sri Siva Kumar Reddy, Health Officer Dr RR Reddy, Additional Health Officer Dr Sunil Kumar, CMO Dr Narmada, DyEO General Sri Ramesh Babu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

క‌రోనా ప‌రిస్థితుల‌పై టిటిడి ఈవో స‌మీక్ష

టిటిడి ఉద్యోగుల్లో గ‌ణ‌నీయంగా త‌గ్గిన యాక్టివ్ కేసులు

5 రోజుల్లో తిరుమ‌ల‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రికి కోవిడ్ ప‌రీక్ష‌లు

తిరుప‌తి, 2020 ఆగ‌స్టు 26: టిటిడిలో నెల‌కొన్న కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నావేసి, కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టరు శ్రీ నారాయణ భరత్ గుప్తా, ఇత‌ర జిల్లా, టిటిడి ఉన్న‌తాధికారుల‌తో టిటిడి ప‌రిపాల‌న‌ భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో బుధ‌వారం సాయంత్రం సమీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు, తిరుప‌తి న‌గ‌రంలోని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే ప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా తగ్గుతోంద‌న్నారు. టిటిడి కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో కూడా అనేక గ‌దులు ఖాళీగా ఉన్న విష‌యాన్ని ఈవో ఉద‌హ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన టిటిడి ఉద్యోగుల్లో ప్ర‌స్తుతం 69 మంది మాత్ర‌మే కోవిడ్ కేంద్రాల‌లో చికిత్స పొందుతున్నార‌ని వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని తెలిపారు. వీరు కూడా త్వ‌ర‌లో విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు సిద్ధ‌మ‌తున్నారన్నారు. కాగా తిరుమలలో 2500 మంది ఔట్ సోర్సింగ్ మ‌రియు ఎఫ్ ఎమ్ ఎస్ కార్మికుల్లో రోజుకు 200 మందికి ఆర్ టి పి సి ఆర్, 300 మందికి ర్యాపిడ్ టెస్ట్ లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవో జిల్లా కలెక్టరును కోరారు. ఐదు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి పాజిటివ్ వచ్చిన వారిని చికిత్సకు పంపి,  క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమ‌ల‌కు మొబైల్ వాహ‌నం, సిబ్బందిని పంపి టిటిడి అధికారులు కోరిన విధంగా నిర్ణిత వ్య‌వ‌ధిలో ప‌రీక్ష‌లు పూర్తి చేస్తామ‌ని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కూడా క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌న్నారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా జిల్లా యంత్రాంగానికి టిటిడి అందించిన ఆర్థిక స‌హాయంపై స‌మీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ.11 కోట్లు వినియోగించి పరికరాలు కొనుగోలు చేశామని, మిగిలిన రూ. 8 కోట్ల‌కు త్వ‌ర‌లో పరికరాలు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

తిరుపతిలోని టిటిడి కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుప‌త్రుల‌లో పిపిఇ కిట్లు, మాస్కులు, చేతి తొడుగులు వంటి మెడిక‌ల్ వ్య‌ర్థాలను తొల‌గించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై స‌‌మీక్షించారు. జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్ర‌తి రోజు కోవిడ్ కేర్ సెంటర్లు మ‌రియు ఆసుప‌త్రుల‌ వ‌ద్ద ఆహార వ్య‌ర్థా‌లు, మెడిక‌ల్‌ వ్య‌ర్థాలను వేరుచేసి తొల‌గిస్తున్న‌ట్లు తెలిపారు. తిరుమలలో కూడా ఈ తరహా వ్యర్థాలు ఉంటే వెంట‌నే తొలగించేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఆరోగ్యాధికారిని ఈవో ఆదేశించారు.
     
ఈ స‌మీక్ష స‌మావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌ జెట్టి, సిఈ శ్రీ రమేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ వీర బ్రహ్మం, అసిస్టెంట్‌ కలెక్టర్ శ్రీ విష్ణుచ‌ర‌ణ్‌, ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్‌ఆర్‌రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, సిఎంవో డాక్టర్ నర్మద, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు పాల్గొన్నారు

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.