ALL-OUT EFFORTS TO PRESERVE FOLK ARTS- TTD  EO _ జాన‌ప‌ద క‌ళ‌ల ప‌రిరక్ష‌ణ‌కు కృషి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

REVIVAL OF AKHANDA HARINAMA SANKEERTANA AT TIRUMALA

 Tirupati, 13 June 2022: TTD EO Sri AV Dharma Reddy said on Monday that TTD will strive to preserve folk arts as part of its agenda to promote Sanatana Hindu Dharma.

Speaking after an interaction with folk artists at Sri Padmavati Rest House, the TTD EO said the Akhanda Harinama Sankeertana program at Tirumala that was suspended due to covid will be revived soon.

An online app will be introduced to facilitate all bhajan teams and artists to apply and given time slots. The selected artists travel fare will be directly credited to their accounts to avert malpractices.

Among others, the bhajan artists will be provided bhajan materials in addition to Srivari darshan, Anna Prasadam, accommodation etc. as in past.

They will also be provided an opportunity to perform in festivals in TTD temples in the districts.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Dharmic Projects in charge Sri Vijayasaradhi, folk art artists sangam leaders Sri K Murali and Sri Jaganmohan Rao were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జాన‌ప‌ద క‌ళ‌ల ప‌రిరక్ష‌ణ‌కు కృషి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

– త్వరలో తిరుమలలో అఖండ హ‌రినామ సంకీర్త‌న కార్య‌క్ర‌మం పునరుద్ధరణ

తిరుపతి, 2022 జూన్ 13: హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జాన‌ప‌ద క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించి అవి అంత‌రించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తుంద‌ని ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో సోమ‌వారం జాన‌ప‌ద క‌ళాకారుల‌తో ఈవో స‌మావేశమయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో గ‌తంలో జ‌రుగుతున్న అఖండ హ‌రినామ సంకీర్త‌న కార్య‌క్ర‌మం కరోనా కారణంగా కొంతకాలం ఆగిందని, త్వరలో పున‌రుద్ధ‌రిస్తామ‌ని తెలిపారు. ప్ర‌త్యేకంగా ఆన్‌లైన్ అప్లికేష‌న్ తయ‌రుచేసి భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు నిర్దేశిత స్లాట్ కేటాయిస్తామ‌న్నారు. అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావులేకుండా స‌భ్యులకు రాను పోను బ‌స్సు ఛార్జీల‌కు అయ్యే రుసుమును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తామ‌ని తెలిపారు. స‌భ్యుల‌కు భ‌జ‌న సామ‌గ్రిని అంద‌జేస్తామ‌న్నారు. గతంలో లాగే తిరుమ‌లలో శ్రీ‌వారి ద‌ర్శ‌నం, అన్నప్రసాదం, వసతి సౌకర్యాలు కల్పిస్తామ‌ని చెప్పారు. తిరుమ‌ల‌తోపాటు వివిధ జిల్లాల్లోని టిటిడి ఆల‌యాల్లో జ‌రిగే ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ స‌మావేశంలో టిటిడి జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, జాన‌ప‌ద వృత్తి క‌ళాకారుల సంఘం నాయ‌కులు శ్రీ కందార‌పు ముర‌ళి, శ్రీ జ‌గ‌న్మోహ‌న్‌రావు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.