GST AND INCOME TAX AWARENESS TRAINING FOR TTD EMPLOYEES _ జిఎస్‌టిపై టిటిడి ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న‌

Tirupati, 9 Mar. 20: TTD has launched a three-day awareness program on GST ad Income Tax for TTD employees at the SVETA Bhavan on Monday.

Earlier at the inaugural session Sri Taraka Srinivasa Rao, Director of Income Tax, Hyderabad, explained the GST process and tax management and said that with GST implementation not only revenue increased but also TTD could support more devotee friendly initiatives.

TTD CAO Sri Sesha Sailendra explained the GST applications in all TTD departments and said payment of GST went a long way in development works across the country.

SVETA Director Dr. K Ramanjula Reddy who presided over the session said in the first phase the TTD employees will be trained in the GST operations for three days and other aspects will be taken up in a phased manner.

TTD Law officer Sri Reddappa Reddy and officials of Income Tax participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

జిఎస్‌టిపై టిటిడి ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న‌

తిరుపతి, 2020 మార్చి 09: టిటిడి ఉద్యోగుల‌కు జిఎస్‌టి, ఆదాయ ప‌న్నుపై మూడు రోజుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ప్రారంభ‌మైంది.

ప్రారంభ స‌మావేశంలో హైద‌రాబాద్‌కు చెందిన ఇండ్ ట్యాక్స్ సంస్థ డైరెక్ట‌ర్ శ్రీ తార‌క్ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ జిఎస్‌టి విధి విధానాల‌ను వివ‌రించారు. జిఎస్‌టి అమ‌లు చేయ‌డం వ‌ల్ల సంస్థ ఆదాయం పెర‌గ‌డంతోపాటు యాత్రికుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌వ‌చ్చ‌న్నారు.

టిటిడి సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర మాట్లాడుతూ జిఎస్‌టి ఎయే విభాగాల్లో ఎక్కువ‌గా ఉంటుంది, ఎక్క‌డ త‌క్కువ‌గా ఉంటుంది అనే విష‌యాల‌ను తెలియ‌జేశారు. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ చెల్లించ‌డం ద్వారా దేశాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన శ్వేత సంచాల‌కులు డా. కె.రామాంజుల‌రెడ్డి మాట్లాడుతూ మొద‌టి విడ‌త‌లో 3 రోజుల పాటు ఉద్యోగులకు జిఎస్‌టిపై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశామ‌ని, ద‌శ‌ల‌వారీగా ఉద్యోగుంద‌రికీ సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి న్యాయాధికారి  శ్రీ రెడ్డెప్ప‌రెడ్డి, ఇండ్ ట్యాక్స్ సంస్థ ప్ర‌తినిధులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.