PUSHPAYAGAM IN SKVST ON MARCH 20 _ మార్చి 20న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Tirupati, 9 Mar. 20: The annual Pushpayaga Mahotsavam will be observed with celestial fervour in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on March 20.

After annual brahmotsavams, this fete is usually observed in all Vaikhanasa Agama temples of TTD as a “Sin- free festival” for the commissions and omissions performed by the religious staff or temple staff or devotees either knowingly or unknowingly during the nine day fete.

It is also performed to protect Mother Nature from all ill happenings including floods, earthquakes, volcanic eruptions etc.and appease Her by offering tonnes of varieties of flowers.

The Ankurarpanam for this festival takes place on March 19. TTD has cancelled all arjitha sevas in connection with this ritual on March 19 and March 20. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

మార్చి 20న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
 
తిరుప‌తి, 2020 మార్చి 09: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం త‌ర‌హాలోనే ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తారు.

ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుండి 22వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

మార్చి 19న గురువారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి 20న శుక్ర‌వారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
 
రూ.500/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 19న తిరుప్పావ‌డ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.