MAHA SAMPROKSHANA FETE OF SRI VAKULAMATA TEMPLE ON JUNE 23- TTD EO _ జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

Tirupati,11 June 2022: TTD EO Sri AV Dharma Reddy on Saturday said that the Maha Samprokshanam of Sri Vakulamata temple built near Perur will be conducted on June 23.

TTD EO who inspected the temple development activities on Saturday said epigraphical sources indicated the existence of a temple for Sri Vakulamata, the foster mother of Sri Venkateswara Swami.

He said temple construction was taken up by the Honourable AP Minister Sri Peddireddy Ramachandra Reddy and directed officials of all departments to complete the development works on a war footing.

The EO said a team of state ministers will visit the temple works on Sunday and made valuable suggestions to officials.

Later the JEO Sri Veerabrahmam reviewed temple works with TTD officials at Sri Padmavati rest house.

TTD board member Sri P Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, APSPDCLC MD Sri Harinath, local leaders Sri MRC Reddy, CE Sri Nageswara Rao and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 జూన్ 11: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 23వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయాన్ని శనివారం ఉదయం ఈవో అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి మాతృమూర్తి అయిన శ్రీ వకుళమాత ఆలయం ప్రాచీన కాలం నుండి పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని చెప్పారు. టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం మరోమారు రాష్ట్ర మంత్రివర్యులతో కలిసి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు.

తరువాత ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి ఈవో పలు సూచనలు చేశారు.

అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి భవనంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం
శ్రీ వకుళమాత ఆలయ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్, ఏపీఎస్పీడీసీఎల్ సి.ఎం.డి.
శ్రీ హరినాథ్,స్థానిక నాయకులు శ్రీ ఎం.ఆర్.సి రెడ్డి, ఛీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.