TTD ANNAPRASADAM IS A ROLE MODEL SCHEME TO OTHERS-CHAIRMAN OF 15TH FINANCE COMMISSION _ టిటిడి అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ స్ఫూర్తిదాయకం : 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్‌

Tirumala, 18 Dec. 19: The Chairman of the 15th Finance Commission Sri Nanda Kishore Singh complimented the Annaprasadam activity of TTD.

The Chairman, along with other members of the Commission, visited Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) on Wednesday evening and also dined in the Complex.

Later speaking to media persons, the Chairman Sri NK Singh termed the massive Annaprasadam activity taken up by TTD is undoubtedly a role model to other organizations. “Tirumala is attracting pilgrims globally with the presence of Lord Venkateswara. The employees working in Annaprasadam are doing commendable services to pilgrims”,  he added.

Earlier, the Additional EO Sri AV Dharma Reddy explained the team of Commission about the cooking, storage and serving activities in the massive Complex.

DyEO Sri Nagaraju,  Catering Officer Sri GLN Shastry and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

టిటిడి అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ స్ఫూర్తిదాయకం : 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్‌

 తిరుమ‌ల‌, 18 డిసెంబ‌రు 2019: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేస్తున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు టిటిడి చేస్తున్న అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఇత‌ర సంస్థ‌ల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్ కొనియాడారు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బుధ‌వారం రాత్రి ఆర్థిక సంఘం ఛైర్మ‌న్‌, స‌భ్యులు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ మాన‌వ సేవే మాధ‌వ సేవ అన్న నినాదంతో టిటిడి పెద్ద సంఖ్య‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేయ‌డం అభినంద‌నీయమ‌న్నారు. ఆధ్యాత్మిక‌త‌తో భార‌త‌దేశం ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని తెలిపారు. భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు టిటిడి అధికారులు, సిబ్బంది ఎంత‌గానో శ్ర‌మిస్తున్నార‌ని కొనియాడారు. అన్న‌ప్ర‌సాదాలు నాణ్యంగా, రుచిగా, శుచిగా ఉన్నాయ‌ని తెలియ‌జేశారు. అంత‌కుముందు అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌ను ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈఓ శ్రీ నాగ‌రాజ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.