PONTIFFS OF VIZAG SHARADA PEETHAM ARRIVES _ విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామికి స్వాగ‌తం

Tirupati, 18 Dec. 19: The revered pontiffs of Sri Sharada Peetham of Visakhapatnam, HH Sri Sri Sri Swaroopananda Swami and HH Sri Sri Sri Swatmanandendra Swami have arrived for Srivari Darshan at Tirumala on Wednesday evening.

They were given a traditional Purna kumbham welcome by the Additional Executive Officer Sri AV Dharma Reddy at Alipiri in Tirupati. 

Earlier state Minister Sri Buggana Rajendranath Reddy also called on the Pontiffs and sought their blessings. 

TTD board members Dr. Chevireddy Bhaskar Reddy and board special invitee Sri Sekhar Reddy present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామికి స్వాగ‌తం

తిరుమ‌ల‌, 18 డిసెంబ‌రు 2019: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనార్థం విచ్చేసిన విశాఖ‌లోని శ్రీ శారద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీశ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి, ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి వార్ల‌కు బుధ‌వారం సాయంత్రం తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, అర్చకులు క‌లిసి పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అద‌న‌పు ఈవో శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను స్వామీజీల‌కు అందించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్వామీజీల‌ను క‌లిసి ఆశీస్సులు అందుకున్నారు.

స్వామీజీల‌ను క‌లిసిన వారిలో బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.