THANKS TO ALL THE COVID WARRIORS OF TTD FOR YOUR IMPECCABLE SERVICES-EO _ టిటిడి ఈవో స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగం

Tirupati, 15 Aug. 20: While congratulating and thanking the Covid Warriors of TTD in discharging their duties with utmost devotion during the lockdown period, TTD EO Sri Anil Kumar Singhal said that TTD employees are always committed to render pilgrim service even during hard times.

Addressing the 74th Independence Day which took place at the Parade Grounds of TTD Administrative Building in Tirupati on Saturday, the EO said, the great sacrifices of the National leaders are not just remembered during the occasion, but we follow the path laid by them by offering the best possible services to the visiting pilgrims, he observed.

After hoisting the Tricolor flag, EO elaborated on the great achievements by TTD and also the services rendered to the pilgrims after the resuming darshan from June 8 onwards by strictly following the COVID guidelines prescribed by Central and State governments and expressed confidence that Lord Venkateswara will protect the entire humanity soon from the dreadful virus.

Some excerpts from his I-Day speech:

  • TTD has launched many religious and spiritual programs for the betterment of humanity and relief from pandemic COVID virus, which included Arogya Japa Yagam, Sri Srinivasa Shantotsava Sahita Dhanvantari Maha Yagam, Chudamani Surya Grahana Japa Yagnam, Veda Parayanam, Yoga Vasistyam-Sri Dhanvantari Maha Mantra Parayanam, Sundarakanda and Virataparva Parayanams etc.
  • TTD measures during lockdown to the denizens of Tirupati and the financial aid of Rs.19crore to the district administration to purchase covid equipment are commendable. Nearly 35lakh food packets were distributed to the migrants and homeless during the lockdown and also fodder and feed to the cattle and stray dogs. The TTD Rest Houses of TTD were made Covid quarantine Centres.
  • Almost after 80 days, darshan of Lord Venkateswara resumed with all precautionary steps for the health of devotees and TTD employees following Covid guidelines. Thanks to devotees who have been cooperating with TTD staff by observing norms of social distancing, using sanitizers and wearing masks while coming for darshan. Till date nearly 4lakh pilgrims had darshan of Lord.
  • All departments of TTD are gearing up for conducting Srivari Brahmotsavams from September 19-27 and Navaratri Brahmotsavams from 16-24 October as per COVID-19 restrictions.
  • TTD is successful in managing the activities of all temples and other institutions without drawing anything from its corpus funds which stand at almost Rs.11, 000 crore. Nearly Rs.52 crore worth coins stagnant at the Parakamani since few years have also been handed over to banks now.
  • To provide better Medicare in its hospitals, TTD has taken up lot of development activities in Aswan hospital at Tirumala where the Tata Trust has provided medical equipment worth Rs. 4crore.
  • TTD board has approved Rs.15.40crore towards the purchase of medical, Rs.5.40crore for new 50 rooms, Rs.8.43crore for new operation theatre in OPD block. TTD has sent proposals to AP government for taking over SVIMS and hiked the monthly grant from Rs.3crore to Rs.5crore.
  • Development works to the tune of Rs.8.50crore are already underway.

  • To strengthen our Vigilance and Security wing, the services of 311 ex-servicemen were taken on temporary basis through Army welfare placement agency and steps have been initiated to recruit security men in the 311 vacancies on permanent basis.
  • Construction of Srivari temples at various locations have commenced again after a lockdown in Visakhapatnam mulled at Rs.29crore, in Bhubaneswar at Rs.6.7crore, Seethampeta, Rampachodavaram and Parvatipuram at Rs.13.50crore. Maha Kumbabhisekam for all these temples will take place in this year.
  • Several Engineering works have also been taken up following the nod from TTD board which includes new hostel complex costing Rs.34.50crore near zoo park for providing more facilities to students of SV Deaf and Dumb school and Junior College hostel for the SV Polytechnic College for the specially able students at a cost of Rs.14crore.
  • The Reliance has come forward to lay shelter at Rs.25crore on the Alipiri foot path.
  • Widening of Alipiri-Cherlopally road at Rs.16crore underway.
  • The modernisation works of Bondi Potu Bhavan at Rs.15 crore by donor is nearing completion while Bhumi puja for Rs.8.90crore Parakamani Bhavan was conducted on Friday.
  • Of the Board approved Rs.4 crore works of Sri Venkateswara temple at Jubilee Hills, works worth Rs.3.20 crores already completed with the contributions from donors.
  • Rs.10crore SV Museum Outer Gallery development works with Map systems of Bangalore are underway while Ms.Tech Mahindra have come forward to do the 3D imaging and display of Srivari ornaments.
  • On Hindu dharma Parachara front 500 temples have been constructed in both Telugu states with support of Samarasata Foundation and another 500 underway with the same institution.
  • Gita Parayanam, Maha Saraswathi Yagam conducted.
  • The online Varalakshmi Vratam and Srivari Kalyanam garnered huge response among devotees.
  • Thanks to all devotees, donors, employees, srivari seva volunteers for their immense support in taking forward many welfare activities for the sake of visiting pilgrims and public in general.

Later 355 employees were awarded Certificates of appreciation for their valuable services during the COVID lockdown period.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basant Kumar, Smt Bhargavi, CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Siva Kumar Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఈవో స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగం
 
తిరుపతి, 2020 ఆగస్టు 15: భారత స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శనివారం నిర్వహించారు. కోవిడ్ నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్ర‌సంగం య‌థాత‌థంగా..

పవిత్రమైన తిరుమల‌ తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధల‌తో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల‌ కైంకర్యాల‌ను నిర్వహిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగుల‌కు, విద్యార్థినీ విద్యార్థుల‌కు,  భక్తకోటికి, శ్రీవారిసేవకుల‌కు 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో యోధుల‌ పోరాటాలు, ప్రాణత్యాగాల‌ ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలిచాడు. ఈరోజు ఆ మహాత్ముల‌ త్యాగాల‌ను మనందరం గుర్తుచేసుకుని వారికి ధన్యవాదాలు తెలియచేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. స్వాతంత్య్ర పర్వదినం రోజున టిటిడి భక్తుల‌కు చేస్తున్న అనేక సేవల‌ను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

ఇదే సమయంలో నేడు ప్రపంచం మొత్తం కోవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ విపత్కర సమయంలో తితిదే అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మరియు తిరుపతి కార్పొరేషన్‌ సిబ్బందితో కల‌సి సమన్వయంతో స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తుల‌కు, తమను తాము రక్షించుకుంటూ విశేష సేవల‌ను అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో త్వరలో  ప్రపంచం కరోనా బారి నుండి  బయటపడగల‌దని విశ్వసిస్తున్నాను.

లోక కల్యాణార్థం యాగాలు :

1. ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు టిటిడి అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టింది.

2. ప్రపంచవ్యాప్తంగా ప్రజ‌లందరూ ఆరోగ్యవంతులుగా ఉండాల‌ని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం, శ్రీశ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించాం. తిరుమల‌ శ్రీవారి పుష్కరిణిలో రాహుగ్రహ చూడామణి సూర్యగ్రహణ జపయజ్ఞం నిర్వహించాం.

3. అదేవిధంగా, లోకక్షేమం కోసం ‘‘యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం’’ పారాయణం నిర్వహించాం.

4. జూన్‌ 11 నుండి సుందరకాండ పారాయణం, జూలై 15 నుండి విరాటపర్వం పారాయణం జరుగుతున్నాయి. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో టిటిడి సహాయక చర్య‌లు

5. మార్చి 24వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుపతిలోని వల‌సకూలీలు, అన్నార్థుల‌కు టిటిడి బాసటగా నిలిచింది.

అన్నప్రసాద వితరణ

6. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్‌ 25వ తేదీ వరకు దాదాపు 36 ల‌క్షల‌ ఆహార పొట్లాలు పంపిణీ చేశాం.

7. అదేవిధంగా, మూగజీవాల‌ కోసం పశుగ్రాసం, ఆహారం కూడా అందించాం.

రూ.19 కోట్లు మంజూరు

8. శ్రీ పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో వైద్య పరికరాల‌ కోసం రూ.19 కోట్లు మంజూరుచేశాం.

విశ్రాంతి గృహాల‌ అప్పగింత

9. కోవిడ్‌ సహాయక చర్యల‌ కోసం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం విశ్రాంతి గృహాలు, రెండో సత్రం, తిరుచానూరులోని పద్మావతి నిల‌యం భవనాల‌ను జిల్లా యంత్రాంగానికి అప్పగించాం.

శ్రీవారి పునర్దర్శనం

11. ఉద్యోగులు, భక్తుల‌ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనల‌ను అనుసరిస్తూ దాదాపు 80 రోజుల‌ తరువాత,  జూన్‌  8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించాము. తితిదే నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్న భక్తుల‌ను అభినందిస్తున్నాము.

12. దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ దివ్యక్షేత్రాలు ఇప్పటికీ ఇంకా దర్శనాన్ని ఇవ్వలేకపోయినా, టిటిడి మాత్ర‌మే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనల‌ను నిబద్దతతో అమ‌లుచేస్తూ ఇప్పటివరకు దాదాపు 4 ల‌క్ష‌ల‌ మంది భక్తుల‌కు సంతృప్తికరమైన దర్శనం కల్పించాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు :

13. శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం టిటిడిలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ నిబంధనల‌కు లోబడి ఈ ఉత్సవాల‌ నిర్వహణ ఉంటుంది.

కార్పస్‌ నిధులు :

14(a).  2020-21వ‌ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3309.89 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను టిటిడి బోర్డు ఆమోదించింది. ఇప్పటి వరకు సుమారు రూ.11 వేల‌ కోట్లు ఉన్న టిటిడి కార్పస్‌ ఫండ్‌ నుండి నిధులు వినియోగించకుండా ఆల‌యాలు, సంస్థ నిర్వహణను సమర్థవంతంగా కొనసాగిస్తున్నాము.

(b).  కొన్నేళ్లుగా పరకామణిలో నిల్వ‌ ఉన్న నాణేల్లో గత సంవత్సర కాలంలో దాదాపు రూ.52 కోట్ల విలువైన నాణేల‌ను వివిధ బ్యాంకుల‌కు అప్పగించాం.

వైద్యం :

15.     తిరుమల‌లో భక్తులు, స్థానికుల సౌకర్యార్థం అశ్విని ఆసుపత్రిని అభివృద్ధి చేశాం. టాటా ట్రస్టు రూ.4కోట్లతో ఆధునిక వైద్య పరికరాల‌ను సమకూర్చగా, టిటిడి రూ.65 ల‌క్ష‌ల‌తో ఆసుపత్రి అభివృద్ధి ప‌నులు చేప‌ట్టింది.

బర్డ్‌ :

16. బర్డ్‌ అభివృద్ధిలో భాగంగా రూ.5.40 కోట్లతో 50 ప్రత్యేక గదుల‌ నిర్మాణం, రూ.8.43 కోట్లతో కొత్త ఓపిడి బ్లాక్‌లో ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణం, రూ.15.40 కోట్లతో వైద్య పరికరాలు‌ కొనుగోలు చేయాల‌ని బోర్డు నిర్ణయించింది.

స్విమ్స్‌ :

17(a). తిరుపతి నగరవాసుల‌కే కాకుండా యావత్‌ రాయల‌సీమ ప్రజానీకానికి కూడా మరింత మెరుగైన, నాణ్యమైన, అత్యాధునిక సౌకర్యాల‌తో కూడిన వైద్యసేవల‌ను అందించాన్న సంక‌ల్పంతో స్విమ్స్‌ను టిటిడి ఆధీనంలోకి తీసుకోవడానికి బోర్డు తీర్మానం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము.

(b) స్విమ్స్‌కు ప్రతినెలా అందిస్తున్న రూ.3 కోట్ల గ్రాంటును బోర్డు రూ.5 కోట్లకు పెంచింది.

(c) రూ.8.50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

నిఘా మరియు భద్రత :

18(a). తిరుమల‌లో మూడో దశలో రూ.20 కోట్లతో 1300 సిసి కెమెరాల‌ ఏర్పాటుకు సర్వే జరుగుతోంది.

(b). నిఘా మరియు భద్రతను మరింత పెంచడంలో భాగంగా ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థ ద్వారా విజిలెన్స్‌ విభాగంలో 311 మంది మాజీ సైనికుల‌తో సెక్యూరిటీ గార్డు సేవల‌ను తాత్కాలిక ప్రాతిపదికన                 ఉపయోగించుకుంటున్నాము. ఈ సెక్యూరిటీ గార్డు పోస్టుల‌ను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

శ్రీవారి ఆల‌యాల‌ నిర్మాణం :  

19(a). విశాఖపట్నంలో రూ.29 కోట్లతో శ్రీవారి ఆల‌య నిర్మాణ పనులు, రూ.6.7 కోట్లతో భువనేశ్వర్‌లో శ్రీవారి ఆల‌యం, మరియు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరంలో రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆల‌యాల‌ నిర్మాణ పనులు లాక్‌డౌన్‌ తరువాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిలోపే అన్ని ఆల‌యాల‌కు మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం.

ఇంజినీరింగ్‌ పనులు :

20(a). ఎస్వీ బదిర పాఠశాల‌ మరియు జూనియర్‌ కళాశాల‌ విద్యార్థుల‌కు మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగా జూపార్కు సమీపంలో రూ.34.50 కోట్లతో హాస్టల్‌ భవనం, రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల‌ శిక్షణ సంస్థ హాస్టల్‌ భవనాల‌ నిర్మాణానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.

(b). అలిపిరి కాలినడక మార్గంలో రిల‌యన్స్‌ సంస్థ సహకారంతో రూ.25 కోట్లతో పైకప్పు పునర్నిర్మాణ పనుల‌ను ఈ నెలాఖరులో ప్రారంభిస్తాం.

(c). అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలివున్న పనులు రూ.16 కోట్లతో జరుగుతున్నాయి.

(d). దాత సహకారంతో తిరుమల‌లో రూ.15 కోట్లతో బూందీ పోటు భవనం పనులు పూర్తి కావస్తున్నాయి. నిన్ననే రూ.8.90 కోట్లతో పరకామణికి ప్రత్యేకంగా భవన నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించాం.

(e). హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో రూ.4 కోట్లతో  శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆయంలో అనేక పనుల‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో  దాత సహాయంతో రూ.3.20 కోట్లతో వివిధ పనులు పూర్తయ్యాయి.

(f). బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్‌ సంస్థ సహకారంతో తిరుమల‌లో రూ.10 కోట్లతో ఎస్వీ మ్యూజియం ఔటర్‌ గ్యాల‌రీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

(g). టెక్‌ మహీంద్రా సంస్థ సహకారంతో శ్రీవారి ఆభరణాల‌ 3డి ఇమేజింగ్‌ మరియు ప్రదర్శన పనులు త్వరలో ప్రారంభిస్తాం.

హిందూ ధర్మ ప్రచారం :

21(b). ధర్మప్రచారంలో భాగంగా సమరసత ఫౌండేషన్‌ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో 500 ఆల‌యాల‌ నిర్మాణం పూర్తి చేశాం. ఇటీవల‌ జరిగిన హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక సమావేశంలో మరో 500 ఆల‌యాల‌ను ఆ సంస్థ సహకారంతో నిర్మించాల‌ని నిర్ణయం తీసుకున్నాం.

(c). ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆల‌య నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆల‌యాలు నిర్మించాల‌ని బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.61.9 కోట్లు విరాళం అందింది.

(d). బాల‌బాలికల‌కు ఆధ్యాత్మిక, మానవీయ, నైతిక విలువ‌లు తదితర అంశాల‌పై అవగాహన కల్పించేందుకు ప్రతినెలా సప్తగిరి మాసపత్రికకు అనుబంధంగా ‘బాల‌ సప్తగిరి’ని అందుబాటులోకి తీసుకొచ్చాం.

(e) విద్యార్థుల‌కు గీతాసారాన్ని తెలియజేసేందుకు తిరుపతిలో సుమారు 10 వేల‌ మంది విద్యార్థుల‌తో సామూహిక గీతా పారాయణం నిర్వహించాం.

(f) టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు, ఆధ్యాత్మికతను అల‌వరిచేందుకు ఫిబ్రవరి 22న తిరుపతిలో సుమారు 10 వేల‌ మంది విద్యార్థుల‌తో ‘‘మహాసరస్వతి యాగం’’ నిర్వహించాం.

ఆన్‌లైన్‌లో  సేవ‌లు  :

22(a) శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో జూలై 31న నిర్వహించిన ఆన్‌లైన్ వ‌రల‌క్ష్మీ వ్రతంలో 3,507 మంది గృహస్తులు పాల్గొన్నారు.

(b) శ్రీవారి ఆల‌యంలో ఆగస్టు 7 నుండి ప్రారంభించిన ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవానికి భక్తుల‌ నుంచి విశేష స్పందన ల‌భించింది.

(c) ఎస్వీబీసీ ట్రస్టుకు ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించే అవకాశం కల్పించాం. హిందీ, క‌న్న‌డ ఛాన‌ళ్లు ప్రారంభించాల‌నీ, నిధులు స‌మ‌కూరిన త‌రువాత హెచ్‌డి ఛాన‌ల్ ప్రారంభించాల‌ని బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.

(d) భక్తులు ఆధ్యాత్మిక గ్రంథాల‌తోపాటు సప్తగిరి మాసపత్రికను ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఇ-పబ్లికేషన్స్‌ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాం.

దాతల‌కు ధన్యవాదాలు :

23. టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టుల‌కు చాలామంది దాతలు విరివిగా విరాళాలిస్తున్నారు. వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

టిటిడి ఉద్యోగులు :

24(a).  అన్ని ఉద్యోగ సంఘాల‌ నాయకుల‌తో తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

(b).     కోవిడ్‌-19 నేపథ్యంలో భక్తుల‌కు విశేష సేవలందిస్తున్న ఉద్యోగుల‌కు ఈ సందర్భంగా అభినందన‌లు తెలియజేస్తున్నాను.

(c). కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల్లో మనోధైర్యం పెంచుతున్నాం. కోవిడ్‌ బారిన పడిన వారికి ఉత్తమ వైద్యసేవ‌లు అందిస్తున్నాం. ఉద్యోగుల‌ ఆరోగ్యభద్రత, సంక్షేమం విషయంలో బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

(d). క్యాంటీన్లలో పోషక విలువ‌ల‌తో కూడిన శుచికరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం.

(e). ఉద్యోగుల‌ కోసం అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద, తిరుమల‌ అశ్విని ఆసుపత్రిలో కోవిడ్‌-19 నిర్ధారణ కోసం శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేశాం.

(f). తిరుపతిలోని శ్రీనివాసం విశ్రాంతి గృహాన్ని పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగుల‌ కోసం ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రంగా ఉపయోగిస్తున్నాం.

(g). ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల‌కు ఎంతో మెరుగైన సేవ‌లు అందిస్తున్నఉద్యోగులు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాని కోరుతున్నాను.

(h). కలియుగ వేంకటేశ్వరుడు యావత్‌ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాల‌ని ప్రార్థిస్తూ సెల‌వు తీసుకుంటున్నాను.
 
టిటిడి ఉద్యోగుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు
 
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో శ‌నివారం 74వ‌ భారత స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంత‌రం విధుల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అధికారులకు, సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు ప్ర‌దానం చేశారు.

ఈ సందర్భంగా కోవిడ్‌-19 స‌మ‌యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేయ‌డంలో, శ్రీ‌నివాసం, విష్ణునివాసంలోని క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సేవ‌లందించిన 31 మంది అధికారులు, సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అందించారు. అదేవిధంగా, ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వివిధ విభాగాల‌కు చెందిన 47 మంది అధికారుల‌కు, 276 మంది సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేశారు. ప్ర‌శంసాప‌త్రాలు అందుకున్న వారి జాబితా జ‌త‌ప‌ర‌చ‌డ‌మైన‌ది.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(విద్య‌, ఆరోగ్యం) శ్రీ‌మ‌తి ఎస్‌.భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, డిఎల్‌వో శ్రీ రెడ్డెప్ప‌రెడ్డి, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.