ISO TEAM LAUDS TTD COLLEGES _ టిటిడి క‌ళాశాల‌ల నిర్వ‌హ‌ణ భేష్‌

TIRUPATI, 28 AUGUST 2021: The ISO certification committee members lauded the maintenance of TTD colleges.

It may be mentioned here that TTD run SPW Degree and PG, SV Arts and SV Govindaraja Swamy colleges have applied for NAAC identity a couple of months ago.

Following the application, a team of ISO Certification Committee members visited all these three colleges in Friday and Saturday.

The Committee met TTD JEO Smt Sada Bhargavi at her chamber in TTD Administrative Building on Saturday. Speaking on the occasion, the Committee members expressed immense satisfaction over the quality of education being imparted to students, maintenance of buildings, office, classrooms, hostels, kitchen, growing of trees, solid waste management, etc.

They also complimented that the execution of Covid protocol measures in the classrooms and hostels are commendable.

The JEO informed them that apart from imparting academic knowledge, the students are being trained on the importance of maintaining clean and green environs in all the TTD run colleges. She said, necessary measures will be taken to overcome hindrances if any.

ISO Committee MD Sri Sivaiah, Directors Smt Mounika, Dr. Vijaya Lakshmi, certification Head Smt Uma Devi, Devastanams Educational Officer Sri Govindarajan, Principals of all the above three TTD colleges were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి క‌ళాశాల‌ల నిర్వ‌హ‌ణ భేష్‌- క‌ళాశాల‌ల‌ను ప‌రిశీలించిన ఐఎస్ఓ బృందం

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 28: టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఆర్ట్స్‌ క‌ళాశాల, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ డిగ్రీ, పిజి క‌ళాశాల, శ్రీ గోవింద‌రాజ స్వామి ఆర్ట్స్ క‌ళాశాలల ప‌ని తీరు బాగుంద‌ని ఐఎస్ఓ స‌ర్టిఫికేష‌న్ క‌మిటీ స‌భ్యులు అభినందించారు. మూడు క‌ళాశాల‌లు న్యాక్ గుర్తింపు కొర‌కు రెండు నెల‌ల క్రితం ద‌ర‌ఖాస్తు చేశాయి. ఈ నేప‌థ్యంలో ఐఎస్ఓ స‌ర్టిఫికేష‌న్ క‌మిటీ స‌భ్యులు శుక్ర‌, శ‌ని వారాల్లో మూడు క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించారు.

శ‌నివారం సాయంత్రం ప‌రిపాల‌న భ‌వ‌నంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఐఎస్ఓ స‌భ్యులు మాట్లాడుతూ టిటిడి క‌ళాశాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు, భ‌వ‌నాలు, వ‌స‌తులు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం మొక్క‌ల పెంప‌కం, వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ బాగున్నాయ‌న్నారు. త‌ర‌గ‌తి గ‌దులు, కార్యాల‌యాలు, హాస్ట‌ల్ గ‌దుల్లో కోవిడ్ – 19 ప్రోటోకాల్ అమ‌లు బాగుంద‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ డిగ్రీ, పిజి క‌ళాశాల‌లో వంట‌గ‌దిని ఆక‌స్మికంగా ప‌రిశీలించామ‌ని, అక్క‌డ నిర్వ‌హ‌ణ ప‌రిశుభ్ర‌త ఆహ‌ర ప‌దార్థాల త‌యారీ బాగుంద‌న్నారు.

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మాట్లాడుతూ టిటిడి విద్యా సంస్థ‌ల్లో ఉన్న‌త విద్యా ప్ర‌మాణాలు అందించ‌డానికి, చ‌క్క‌టి వాతావ‌ర‌ణం ఏర్పాటు చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు. ఐఎస్ఓ బృందం ఏవైనా లోపాలు గుర్తించి ఉంటే వాటిని స‌రిదిద్ధుకుని మ‌రింత ఉన్న‌త విద్యా ప్ర‌మాణాలు క‌ల్పించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఐఎస్ఓ క‌మిటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ శివ‌య్య ఆలపాటి, డైరెక్ట‌ర్లు శ్రీ‌మ‌తి ఎ. మౌనిక‌, డా.టి.విజ‌య‌ల‌క్ష్మి, స‌ర్టిఫికేష‌న్ హెడ్ శ్రీ‌మ‌తి టి.ఉమాదేవి, విద్యా శాఖ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్, క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ళు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.