ALL LOCAL TEMPLES OPEN UP AFTER GRAHANA KAALAM ENDS _ టిటిడి స్థానిక ఆలయాల్లో కైంక‌ర్యాలు – దర్శనం పునఃప్రారంభం

Tirupati, 21 Jun. 20: All the local temples under the umbrella of TTD opened up after Choodamani Surya Grahanam concluded on Sunday.

The temple cleansing activities including Suddhi and Punyahavachanam conducted in all including Tiruchanoor, Appalayagunta, Srinivasa Mangapuram, Kapilateertham, Govindaraja Swamy and Kodanada Ramaswamy temples followed by daily Kainkaryams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాల్లో కైంక‌ర్యాలు –  దర్శనం పునఃప్రారంభం

తిరుపతి, 2020 జూన్ 21: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆలయాల్లో ఆదివారం సాయంత్రం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. జూన్ 21వ తేదీన సూర్య‌గ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను శ‌ని‌వారం రాత్రి మూసివేసిన విషయం విదితమే.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం నిర్వ‌హించారు. ఆనంత‌రం సాయంత్రం 4.30 గంట‌ల నుండి 6 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనం కల్పించారు.

 తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు  భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ‌క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో గ్ర‌హ‌ణానంత‌రం ఆల‌యశుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం నిర్వ‌హించారు. అనంత‌రం సుప్ర‌భాతం, తోమాల‌సేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, మొద‌టి గంట‌, సాత్తుమొర‌, రెండో గంట నైవేద్యాలు స‌మ‌ర్పించారు. చూడామ‌ణి సూర్య గ్ర‌హ‌ణం వ‌ల‌న   ఈ ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ర‌ద్ధు చేశారు. జూన్ 22వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు   తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేశారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వ‌రకు సుప్ర‌భాతం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న నిర్వ‌హించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌రకు శుద్ధి, మొద‌టి గంట‌, రెండో గంట‌, రాత్రి గంట నైవేద్యాలు స‌మ‌ర్పించారు. రాత్రి 7.30 గంట‌లకు ఏకాంత సేవ నిర్వ‌హించారు. భ‌క్తుల‌ను అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌లేదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.