314 NEW PRODUCTS FROM TTD AYURVEDA PHARMACY _ టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 314 నూతన ఉత్పత్తులు – మార్చి 31న నూతన షెడ్ ప్రారంభం 

– INAUGURATION OF NEW SHED ON 31st MARCH

Tirupati, 25 March 2023: An exercise is underway to manufacture 314 new medicines from TTD Ayurveda Pharmacy in Narasingapuram soon, said TTD JEO(H&E) Smt Sada Bhargavi.

Along with the officials, the JEO inspected the expansion works of the Ayurvedic Pharmacy at Narasingapuram on Saturday evening. Speaking on this occasion she said that in the first phase, a new shed will be opened on March 31, which will be equipped with advanced machines to manufacture 10 types of medicines. 

She said the management has decided to manufacture additional 314 types of medicines to provide modern medicine to the patients. According to this, the pharmacy is being developed with Rs.5 crores, she said. She said that 30 types of medicines are currently being produced in the pharmacy. Recently 314 drug formulas have received certification from AYUSH.

JEO said that apart from providing medicines manufactured in SV Ayurveda Pharmacy to patients in TTD Ayurveda Hospital, the Ministry of AYUSH has given permission to the government to pay 50 percent of the production cost of the medicines.

Earlier, the JEO inspected the installation of new machines and the sheds constructed in the premises of the pharmacy. Various instructions were given to the officials by JEO regarding the raw materials required for the 10 types of products to be launched on 31st, as well the engineering department regarding arches, sign boards, catalog etc.

Chief Engineer Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateshwarlu, Ayurveda College Principal Dr. Muralikrishna, Ayurveda Hospital Superintendent Dr. Renu Dixit, Pharmacy Technical Officer Dr. Narappareddy, EE Sri Murali Krishna, DE Electrical Smt. Saraswathi participated.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 314 నూతన ఉత్పత్తులు -. మార్చి 31న నూతన షెడ్ ప్రారంభం

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 25 మార్చి 2023: నరసింగాపురంలోని టీటీడీ ఆయర్వేద ఫార్మసీ నుంచి 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి కసరత్తు జరుగుతోందని జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేయడానికి అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన నూతన షెడ్ ను మార్చి 31వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు .

జేఈవో అధికారులతో కలిసి శనివారం సాయంత్రం ఆయుర్వేద ఫార్మసీ విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, రోగులకు, ఆధునిక వైద్యం అందించడానికి అదనంగా 314 రకాల ఔషధాలు తయారు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇందుకు అనుగుణంగా రూ.5 కోట్లతో ఫార్మసీని అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫార్మసీలో ప్రస్తుతం 30 రకాల ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 314 ఔషధాలకు ఫార్ములాలకు ఆయుష్ నుండి సర్టిఫికేషన్ లభించిందని చెప్పారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారయ్యే ఔషధాలు టీటీడీ ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు అందించడంతో పాటు , ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా 50 శాతం ఔషధాలు ఉత్పత్తి వ్యయం చెల్లించేలా ప్రభుత్వానికి అందించేందుకు అనుమతి లభించిందని జేఈవో తెలిపారు. రెండవ, మూడవ విడతల్లో ఆయుర్వేద ఫార్మసీని మరింత అభివృద్ధి చేయనన్నట్లు వివరించారు.

అంతకుముందు జేఈవో నూతన యంత్రాల ఏర్పాటు, ఫార్మసీ ప్రాంగణంలో నిర్మించిన షెడ్లను పరిశీలించారు. 31వ తేదీ ప్రారంభించనున్న 10 రకాల ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాలతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ఆర్చి, సైన్ బోర్డులు, క్యాటలాగ్ తదితర అంశాలకు సంబంధించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీసత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారపరెడ్డి, ఈఈ శ్రీమురళీ కృష్ణ, డిఈ శ్రీమతి సరస్వతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.