JEO INSPECTS CENTRAL HOSPITAL _ టీటీడీ కేంద్రీయ ఆసుపత్రిలో జేఈవో తనిఖీలు

Tirupati, 4 Mar. 21: TTD Joint Executive Officer Smt Sada Bhargavi inspected the preparations for Covid vaccinations for TTD employees at the Central hospital in the TTD administrative building on Thursday and made valuable suggestions.

The vaccination of all TTD employees of Tirupati is set to begin from Friday.

She instructed officials to check the feasibility of allowing Aadhar card or any other ID cards of employees registering for Covid vaccination.

She advised officials to earmark separate rooms for vaccination and observation of employees thereafter and also to remove all waste furnitures and cardboard boxes lying in the hospital corridors.

The TTD JEO instructed the hospital authorities to segregate the records of TTD employees and the patients and digitise them with the assistance of the EDP department.

She asked officials to organise orderly parking, clearance of garbage and also set up caution sign boards in the hospital complex for benefit of patients and employees.

Chief Medical Officer Dr Narmada, Additional Health Officer Dr Sunil Kumar and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ కేంద్రీయ ఆసుపత్రిలో జేఈవో తనిఖీలు

తిరుపతి 4 మార్చి 2021: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని కేంద్రీయ వైద్య శాలను జెఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం తనిఖీ చేశారు.

శుక్రవారం నుంచి తిరుపతి లోని టీటీడీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్న దృష్ట్యా ఆమె ఆసుపత్రిని పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకునే ఉద్యోగుల వద్ద ఆధార్ తో పాటు వీలైతే మరో గుర్తింపు కార్డును కూడా అంగీకరించే అంశం పరిశీలించాలన్నారు.

వ్యాక్సినేషన్ కోసం, ఆతరువాత అబ్జర్వేషన్ కోసం ప్రత్యేకంగా గదులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆసుపత్రి వరండాల్లో అట్టపెట్టెలు, పాడైన వస్తువులు, ఫర్నీచర్ లేవీ ఉంచరాదన్నారు. రోగులు, ఉద్యోగుల రికార్డ్స్ టీటీడీ ఈడిపి విభాగం సహకారంతో డిజిటైజ్ చేయాలని జెఈవో ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో వాహనాల పార్కింగ్ ఒక క్రమ పద్ధతిలో ఉంచాలన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగుల సౌకర్యం కోసం అవసరమైన చోట సూచిక బోర్డ్ లు, ముందస్తు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

చీఫ్ మెడికల్.ఆఫీసర్ డాక్టర్ నర్మద, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు జెఈవో వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.