MUTYAPU PANDIRI PROVIDES SOOTHING FEEL TO DEVOTEES _ ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంక‌న్న

The processional deity of Sri Kalyana Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi, seated majestically on the pearl canopy on the third day evening as part of the ongoing Navahnika Varshika Brahmotsavams at Srinivasa Mangapuram.

As Kaliya Mardhana Krishna, flanked by His two consorts on either sides, the Lord blessed the devotees sending a message that He is always there when comes to the rescue of His devotees from evil forces.

DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu were also present in this vahana seva which was observed in Ekantam due to COVID restrictions.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంక‌న్న

తిరుపతి, 2021 మార్చి 04: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి శ్రీనివాసుడు కాళీయమర్దనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై క‌టాక్షించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

శుక్ర‌వారం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌భూపాల వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.