TTD INVITES SPECIALISTS DOCTORS FOR VOLUNTARY SERVICE IN PAEDIATRIC HOSPITAL _ తిరుపతి లోని చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవకై సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఆహ్వానం.

Tirumala, 03 October 2021:TTD has invited paediatric cardio thoracic surgeons and child specialists from all the recognised children’s hospitals across the country to render voluntary service at the new Sri Padmavati Children Heart Centre (Paediatric Hospital), which is coming up shortly at the BIRRD complex in Tirupati.

In a statement released on Sunday, doctors professing Hindu religion with 15 years experience are being sought to perform the heart surgeries and related services to the new born infants under SV Pranadana Trust of TTD.

TTD has also offered two options. Under option A for rendering voluntary service, the Doctor along with five family members will be provided free accommodation, protocol VIP break Darshan at Tirumala along with free transport between Tirumala and Tirupati.

Under option B the specialists who are will to perform service on remuneration shall be provided honorarium as per TTD regulations but accommodation, Darshan and transport will not be provided free of cost

The CMO said interested specialists and child experts could send emails to cmo.adldirector@gmail.com with details and the category opted by them.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతి లోని చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవకై సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఆహ్వానం.

తిరుమల 3 అక్టోబర్ 2021: తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించనున్న శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ( శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ) ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవలు అందించడానికి భారతదేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, డాక్టర్లును ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీటీడీ ప్రాణదానం పథకం కింద నిర్వహించనున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరియు పిల్లలకు గుండె చికిత్సలు, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన డాక్టర్లు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఈ స్వచ్ఛంద సేవలను ఆప్షన్ A మరియు ఆప్షన్ B అనే రెండు విధానాలలో చేయవచ్చును. ఆప్షన్ A విధానం లో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్ తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రోటోకాల్ దర్శనం, తిరుమల – తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించడం జరుగుతుంది.

ఆప్షన్ B కింద.స్వచ్ఛంద సేవ కై ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషకం చెల్లించడం జరుగుతుంది. ఆప్షన్ B ఎంచుకునే వారికి వసతి, దర్శనం, స్థానికంగా రవాణా సదుపాయాలు కల్పించడం జరగదు.

ఆసక్తి గల వైద్యనిపుణులు cmo.adldirector@gmail.com మెయిల్ ఐడి కి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి యోగ్యతా పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది