PAVITRA SAMARPANA HELD _ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

TIRUPATI, 03 OCTOBER 2021: The annual Pavitrotsavams at Appalayagunta entered second day on Sunday.

 

The sacred Pavitra malas were decorated to mula virat, utsava murthies, parivara devatas and Pavitra Pratistha was observed.

 

 

Deputy EO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and other staffs were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2021 అక్టోబరు 03: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం మూల విరాట్‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వార్‌కు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి, ధ‌్వ‌జ‌స్తంభం, ఇత‌ర ప‌రివార‌ దేవ‌త‌ల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. కాగా రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, కంక‌ణబ‌ట్ట‌ర్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.