TIRUPPAVAI IS ESSENCE OF ALL VEDAS- TIRUMALA SRI CHINNA JEEYAR SWAMY _ తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృప – వేదాల సార‌మే తిరుప్పావై : శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి

TIRUPATI, 17 DECEMBER 2022: Tiruppavai penned by Sri Goda Devi is the essence of all Vedas and is the easy way to attain the blessings of Almighty said Sri Chinna Jeeyar Swamy of Tirumala.

 

During his Anugraha Bhashanam on the occasion of the opening ceremony of Andal Thiruppavai pravachanam in Annamacharya Kalamandiram at Tirupati on Saturday evening held under the aegis of Alwar Divya Prabandha Project of TTD he said Andal was one among 12 Alwars who has glorified His presence with her Pasurams.

 

Renowned scholar Sri Chakravarthi Ranganathan who will be delivering the Pasura Parayanam for the next one month said Goda Devi offered floral garlands as well rendered Pasurams in praise of Lord. Dr Dwaram Lakshmi will be reciting the Pasurams.

 

SVETA Director Smt Prasanti, HDPP AEO Sri Satyanarayana, Alwar Divya Prabandha Project Program Officer Sri Purushottam were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృప – వేదాల సార‌మే తిరుప్పావై : శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి

తిరుప‌తి, 2022 డిసెంబ‌రు 17: తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపకు పాత్రులు కావచ్చని, వేదాల సార‌మే తిరుప్పావై అని తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి చెప్పారు.

టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం రాత్రి తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్ల‌లో గోదాదేవి ఒకరిని స్వామి చెప్పారు. గోదాదేవి అన‌న్య‌మైన భ‌క్తిభావ‌న‌తో భ‌గ‌వంతుని కీర్తిస్తూ పాశురాలు ర‌చించార‌ని తెలిపారు. భ‌గ‌వంతుని ఆరాధ‌న‌కు భాషతో ప‌నిలేద‌ని, భావ‌న ముఖ్య‌మ‌ని చెప్పారు.

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ స్వామి మాట్లాడుతూ, సూర్యుడు ధ‌ను రాశిలో ప్ర‌వేశించ‌డాన్నే ధ‌నుర్మాసం అంటార‌న్నారు. ఈ మాసంలో బ్ర‌హ్మ ముహూర్తంలో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని చెప్పారు. గోదాదేవి అమ్మ‌వారు పూమాల‌ల‌తోపాటు పాశురాల మాల‌ను శ్రీ రంగ‌నాథ‌స్వామికి స‌మ‌ర్పించార‌ని వివ‌రించారు.

కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 18 నుంచి జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ స్వామి తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేస్తారు. శ్రీ‌మ‌తి ద్వారం లక్ష్మి పాశురాల‌ను వినిపిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, హెచ్ డిపిపి ఏఈవో శ్రీ సత్యనారాయణ, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.