EXTENSIVE ARRANGEMENTS MADE FOR VAIKUNTA EKADASI DARSHAN AT BANGALORE SV TEMPLE LOCATED 16th CROSS VAYALI KAVAL IN MALLESWARAM _ బెంగళూరులోని మల్లేశ్వరం వయాలికావల్ వద్ద ఉన్న  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు 

Bengaluru,17 December 2022: The Bengaluru local advisory committee chairman Sri Ravi Sampat Narayana said on Saturday that extensive arrangements are being made for Vaikunta Ekadasi Darshan to a large number of devotees at SV temple in Bengaluru.

Addressing a media conference at TTD Information Center along with DyEO Sri Gunabhushan Reddy on Saturday, Sri Narayana said that on Vaikunta Ekadasi day, Darshan would begin at 2.00am and all daily kaikaryas will be performed as per Vaikhanasa Agama traditions only.

He said separate queue lines are being organised for VIPs, ₹200 Special Darshan, Sarva Darshan and appealed to VIPs to come at their allotted time slots as Sarva Darshan is allowed during other time slots.

He appealed to devotees that on Vaikunta Ekadasi day the Srivari Darshan will commence at 2am and continue till 11 pm. The devotees who could not visit Tirumala on Vaikunta Ekadasi day could have Srivari Darshan at Bangalore itself.

Among others floral and electrical decorations, parking facility at  Malleswaram Public Garden, Shelter from varied weather conditions, signboards to be displayed etc. were also briefed.

He said cultural, Dharmic and Bhakti sangeet programmes will be held by the artists of HDPP besides TTD calendars, diaries and laddus are made available for sale.

MLC Sri Saravana, TTD PRO Dr T.Ravi, Bengaluru local advisory committee vice Chairman Sri Adiga  Radhakrishna, Secretary Sri Bhaktavatsala Reddy, Treasurer Sri Ramesh Reddy, members Smt Vasantha Kavitha, Sri Babu Reddy, Smt Geeta Rammohan, Sri Venkatesh Reddy, Smt Renuka, Sri Lallesh Reddy, Deputy EEs Sri Sarvesh, Sri Parasuram, Superintendent Smt Jayanti were also present. Later the Dy EO along with other officials inspected the Q lines, parking place etc.,

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బెంగళూరులోని మల్లేశ్వరం వయాలికావల్ వద్ద ఉన్న  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు 
 
– బెంగుళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు Dr.రవి సంపత్ నారాయణ
 
 బెంగుళూరు, 2022 డిసెంబర్ 17: బెంగుళూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాదిగా విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం  కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బెంగుళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ రవి సంపత్ నారాయణ చెప్పారు.   బెంగుళూరులోని టీటీడీ సమాచార కేంద్రంలో డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డితో కలిసి ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు.
     
టీటీడీ సమాచార కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు యధావిధిగా నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తెల్లవారుజామున 2 నుండి  స్వామివారి  దర్శనం ప్రారంభమవుతుందని, ఆలయం వద్ద విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్, రూ. 200 శీఘ్ర దర్శనంప్రత్యేక క్యూ లైన్, సర్వదర్శనం ప్రత్యేక కులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విఐపిలు తమకు ప్రత్యేకంగా కేటాయించిన సమయంలోనే వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిగతా సమయం అంతా సర్వదర్శనానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున సర్వదర్శనం ఉదయం 2 గంటలకు  ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
 
వైకుంఠ ఏకాదశి రోజు  తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు బెంగుళూరు లోని స్వామి వారిని దర్శించుకోవాలని ఆయన భక్తులకు సూచించారు. సమాచార కేంద్రం పక్కన ఉన్న చౌడప్ప స్మారక భవనం రోడ్డులో,  మల్లేశ్వరం పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఇతర సేవల కొరకు శ్రీవారి సేవకులు, పోలీస్ యంత్రాంగం సహకారం తీసుకుంటామన్నారు. స్వామివారి ఆలయం, కల్యాణ మండపాలకు  పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు సూచిక బోర్డులను  ఏర్పాటు చేస్తామన్నారు.
 
టీటీడీ  హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటాయని, తిరుమల నుండి వచ్చే శ్రీవారి లడ్డు ప్రసాదము,క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.
 
ఈ సమావేశంలో    ఎమ్మెల్సీ  శ్రీ శరవణ, టీటీడీ పిఆర్ఓ టి. రవి,  టీటీడీ స్థానిక సలహా మండలి ఉపాధ్యక్షులు శ్రీ అడిగా రాధాకృష్ణ, సెక్రటరీ శ్రీ భక్తవత్సల రెడ్డి, ట్రెజరర్ శ్రీ రామ శేషారెడ్డి, సభ్యులు శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీమతి వసంత కవిత , శ్రీ బాబు రెడ్డి, శ్రీమతి గీతా రామ్మోహన్, శ్రీ వెంకటేష్ రెడ్డి, శ్రీమతి రేణుక, శ్రీ లల్లేష్ రెడ్డి, డిప్యూటీ ఈఈలు శ్రీ సర్వేష్, శ్రీ పరశురాం, సూపరిండెంట్ శ్రీమతి జయంతి పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.