ADDNL.EO LAUNCHES PULSE POLIO PROGRAM AT TIRUMALA _ తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 19 Jan. 20: The 25th phase of pulse polio programme was launched by the Additional Executive Officer Sri A V Dharma Reddy at Tirumala on Sunday.

Speaking on the ocassion he said pulse polio camps were set up at 25 locations in Tirumala of which 19 were for devotee pilgrims and rest of 6 for locals,employees etc.

All devotees and others should take full advantage of pulse polio camps operating from morning 7am to evening 6pm and get polio drops for all infants from 0-5 years.

Meanwhile Pulse polio camps were set up under the aegis of the TTD medical wing in Tirumala at Aswini hospital,  GNC, RTC bus stand, CRO, PAC1,2, MBC-34, new bus stand, Vaikuntam 1&2, health office at ATC, Supatham, Varahaswami, Rambsgicha, inside Srivari temple, vahana mandapam, Kalyana Katta,two centres in Balaji nagar, TTD employees dispensary, SV high school, Papavinasam, Alipiri footpath.

Ashwini hospital superintendent Dr Narmada, Kalyana Katta dispensary superintendent Dr Kusuma Kumari, Central Hospital Medical Officer Dr Kusuma Kumari and other officials, para medical staff participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 19: జ‌న‌వ‌రి 19వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన 25వ విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 19 ప్రాంతాలలో భక్తులకు, 6 ప్రాంతాలలో స్థానికులకు, ఉద్యోగులకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.

కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో అశ్విని, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్‌, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, నూతన ఆర్‌టిసి బస్టాండ్‌, వైకుంఠం 1 మరియు 2, హెల్త్‌ ఆఫీసు, ఎటిసి, సుపథం, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, వాహనమండపం, కల్యాణకట్ట, బాలాజీ నగర్‌లో రెండు కేంద్రాలు, టిటిడి ఉద్యోగుల డిస్పెంన్సరి ఎస్‌.వి. హైస్కూల్‌, పాపావినాశనం చెంత పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా, అలిపిరి కాలిబాట చెంత ఒక్క మొబైల్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జెఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా|| నర్మద, కల్యాణకట్ట డిస్పెంన్సరి సూపరింటెండెంట్‌ డా|| కుసుమకుమారి, ఇతర అధికారులు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.