ADHYAYANOTSAVAM CONCLUDES IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

Tirumala, 19 Jan. 20: The Nalayira Divya Prabanda gosti was performed at the Ranganayakula mandapam of Srivari temple in the presence of utsava idols of Sri Malayappaswamy and His consorts on Sunday herlarding the conclusion of the holy ritual of Adhyayanotsavam.

On the last day on Sunday,  the holy fete of Tannirmudu utsavam was conducted. The utsava deities were taken on a a grand procession to Tirumala Nambi, the ardent srivaishanavaite devotee of Lord Venkateswara located in South Mada Street in the evening after Sahasra Deepalankara seva

Later, the descendants of Saint disciple Sri Tirumala Nambi carried  holy water from Akasha Ganga on their heads and performed Abhisekam to the golden feet of the mula Virat inside the Srivari temple amidst chanting of Veda mantras along with Vaishnavite Jeeyar swamis and Acharyas. They also recited the Tirumozhi pasuras penned by Tirumala Nambi on the occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
 
తిరుమల, 2020 జ‌న‌వ‌రి 19: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు  26వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

ఆదివారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జనవరి 20న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

ఘనంగా  ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం –

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో ఆదివారం నాడు ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని తీసుకువ‌చ్చి ఆల‌య అర్చ‌కులకు అందించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.
 
అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.