EO VERIFIES FRT _ తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలును పరిశీలించిన టీటీడీ ఈవో

TIRUMALA, 02 MARCH 2023: TTD EO Sri AV Dharma Reddy on Thursday verified the functioning of Face Recognition Technology introduced by TTD on Wednesday for the benefit of devotees in an experimental manner.

 

EO inspected ARP, CRO, MBC 34, SMC, TBC sub-enquiry offices where accommodation is being allotted.

 

Speaking to the media, he said this technology will help root out the Dalari system at SSD, Laddu counters and Refund centres. “With FRT the rotation of rooms shall be completely avoided and transparency can be enhanced in the allotment of rooms to devotees”, he added.

 

Similarly in VQC 2 every devotee going for Sarva Darshan will be provided with a Rs.50/- laddu free of cost. To avoid the misuse of these laddus also this technology is used, the EO maintained.

 

DyEOs Sri Harindranath, Sri Bhaskar, AEO Sri Venkateswarulu Naidu, OSD Sri Ramakrishna and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలును పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమల, 02 మార్చి 2023: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు వీలుగా మార్చి 1వ తేదీ నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గదులు కేటాయించే కేంద్రాలు, ఉప విచారణ కార్యాలయాలను ఈవో గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా తగ్గించేందుకు, టిటిడి అందిస్తున్న సౌకర్యాలు సామాన్య భక్తులకు పూర్తిస్థాయిలో చేరేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తిరుమలలో సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో ఈ పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా ప్రారంబించినట్లు తెలిపారు. తద్వారా గదులను రొటేషన్ చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చన్నారు. గదుల కొరకు పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు త్వరితగతిన రూములు దొరుకుతున్నాయని తెలిపారు.

రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.50/- ఉచిత లడ్డు టోకెన్లు ఇవ్వడం జరుగుతోందని, ఈ పరిజ్ఞానం ద్వారా లడ్డు ప్రసాదాలలో దళారి వ్యవస్థను కట్టడి చేయవచ్చని వివరించారు.

అంతకుముందు ఈవో ఏఆర్పి, సిఆర్ఓ, ఎంబీసీ 34 గదుల కేటాయింపు కేంద్రాలు, ఏఎంసి, ఎస్ఎంసి, టిబిసి ఉప విచారణ కార్యాలయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈవో వెంట డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, ఓఎస్డి శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.