DIVYA DARSHAN TOKENS FOR NON-TICKET HOLDERS SOON-EO _ తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో భక్తులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు – డయల్‌ యువర్‌ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి 

TIRUMALA, 03 MARCH 2023: TTD is contemplating to resume Divya Darshan to those who do not possess any tokens or tickets for Srivari darshan, said TTD EO Sri AV Dharma Reddy.

During the monthly, “Dial your EO ” program held at Annamaiah Bhavan in Tirumala on Friday the EO received calls from 26 pilgrim callers hailing from various states across the country. Reacting to a couple of callers who sought EO to resume Divya Darshan tokens on both the footpath routes, the EO said, even the darshan ticket holders also trek the Alipiri and Srivari Mettu footpath routes. So to avoid issuance of Divya Darshan tokens to the pilgrims who already possess SSD, SED, VIP break or Arjita Seva tickets, we have done a survey to find the count. About 60% of pilgrims are found trekking the footpaths without any tokens. So we will soon design an app and resume issuance of DD tokens”, he said.

Two more callers brought to the notice of EO about the non-receiving of any accommodation confirmation message though the amount was paid in UPI mode, to which the EO said, the issue will be looked at by the IT team of TTD and sorted out soon.

Pilgrim Callers also suggested EO to accept only Adhaar while booking electronic dip tickets as some devotees are making multiple ticket bookings with Voter Id also. Welcoming their suggestion, the EO said it will be implemented to enable Arjita Seva tickets in electronic dip to more number of devotees.

The EO also replied another caller Sri Venkataramakrishna from Hyderabad who expressed doubts on overload of server as TTD has released three months quota of Arjita Seva tickets online at one go, saying that TTD resumed the old system of releasing three months quota of Arjita seva tickets online that existed before Covid. “Now we are releasing more tickets through Cloud on the Jio platform to avoid any technical issues”, he added.

Pilgrim callers Sri Suresh from Salem and Sri Sudhakar from Guntakal appreciated TTD for introducing RFT in accommodation. 

Another caller Sri Trimurtulu from Anakapalle brought to the notice of EO about the sale of eatables in plastic covers inside Vaikuntham Queue Complex by some vendors in spite of a ban on Plastic in Tirumala. Reacting to the query, the EO said, the Vigilance sleuths will be directed to enhance vigil to avoid such activities.

Later the EO said, about 18.42lakh devotees had darshan in the month of February while the Hundi collections stood at Rs.114.29crores, 92.96lakh laddus were sold out, while 34.06lakhs had Annaprasadam and 7.21lakh devotees offered tonsuring.

 
TTD JEO for Health and Education Smt Sada Bhargavi, CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో భక్తులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు – డయల్‌ యువర్‌ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 మార్చి 03: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

1. సురేష్‌ – సేలం
ప్రశ్న : ఇటీవల టీటీడీ ప్రారంభించిన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో గదుల కేటాయింపు, ఉచితంగా రూ.50/- లడ్డు టోకెన్స్‌ ఇవ్వడం చాలా బాగుంది. రాంబగీచా ఎదురుగా, నందకం వద్ద వున్న టాయిలెట్స్‌ శుభ్రంగా ఉంచండి.
ఈవో : పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

2. వెంకట రామకృష్ణ – హైదరాబాద్‌
ప్రశ్న : ఒకేసారి మూడు నెలలకు ఆన్లైన్లో దర్శనం, ఆర్జిత సేవలు విడుదల చేశారు. నెలకు ఒకసారి విడుదల చేస్తే బాగుంటుంది.

ఈవో : కరోనాకు ముందు మూడు నెలలకు ఒకసారి దర్శనం, ఆర్జిత సేవలు టీటీడీ విడుదల చేసేది. కరోనా కారణంగా పరిస్థితిని బట్టి నెలకు ఒకసారి విడుదల చేశాము. కరోనా తగ్గి పోయింది కాబట్టి తిరిగి మూడు నెలలకు ఒకేసారి విడుదల చేస్తున్నాము.

3. సునంద – ఖమ్మం

ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాంగులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గదులు కేటాయించడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈవో : గదుల అందుబాటును బట్టి వృద్ధులు, దివ్యాంగులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే గదులు కేటాయిస్తున్నాము.

4. రమ్య – హైదరాబాద్‌ జ్యోతి ` ఏలూరు

ప్రశ్న : శ్రీవారి ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా పొందిన భక్తులకు తిరిగి మూడు నెలలు రాదు. కానీ కొందరు ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డుతో నెల నెలపొందుతున్నారు. అందరికి ఆర్జిత సేవలో శ్రీవారి దర్శనం టికెట్లు పొందేలా చర్యలు తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా ఇవ్వండి.

ఈవో : ఆధార్‌ ద్వారానే ఆర్జిత సేవా టికెట్లు పొందేలా ఏర్పాటు చేస్తాం. ప్రతిరోజు లక్కిడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందేందుకు ముందు రోజు తిరుమలలో పేర్లు రిజిస్టర్‌ చేసుకుంటే పొందవచ్చు.

5. శంకర్‌ ` హైదరాబాద్‌

ప్రశ్న ` ఆన్‌లైన్‌లో లక్కిడిప్‌ ద్వారా సేవా టికెట్లు పొందిన వాళ్ళకి వసతి ఇచ్చేలా చర్యలు తీసుకోండి.

ఈవో ` పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

6.సుధాకర్‌ ` గుంతకల్‌

ప్రశ్న ` టిటిడి భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కళ్యాణి గెస్ట్‌ హౌస్‌లో లిఫు,్ట గీజర్లు ఏర్పాటు చేయండ.

ఈవో ` గోవర్ధన్‌, కళ్యాణి, సుదర్శన్‌ వసతి గృహాలు దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినవి. వాటిని తొలగించి కొత్త వాటిని నిర్మిస్తాము.

7.త్రిమూర్తులు ` అనకాపల్లి

ప్రశ్న ` వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అనధికారికంగా స్నాక్స్‌, కూల్‌ డ్రిరక్స్‌ అమ్ముతున్నారు. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈవో ` వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అనధికారికంగా స్నాక్స్‌, కూల్‌ డ్రిరక్స్‌ అమ్ముతున్న కొందరిని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.

8.లక్ష్మి ` హైదరాబాద్‌

ప్రశ్న ` రూ.100 గదికి రూ.500 రూపాయలు కాషన్‌ డిపాజిట్‌ తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందిగా ఉంది.

ఈవో` పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

9.విజయ రామారావు ` విజయవాడ

ప్రశ్న `ఆర్జిత సేవల ధరలు కనీసం రూ.500 చేశారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం టికెట్లను కూడా పెంచారు. గదులు ఆన్లైన్లో బుక్‌ చేసుకోవడానికి బుక్‌ కావడం లేదు.

ఈవో` దర్శనం టికెటు రూ.300 రూపాయలు. సేవకు హాజరైనందుకు రూ.200 మొత్తం రూ.500. సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా సమస్య ఉంటే పరిశీలించి గదులు ఆన్లైన్లో బుక్‌ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తాం.

10. ప్రవీణ్‌ ` పుట్టపర్తి

ప్రశ్న ` ఆలయ నాలుగు మడ వీధుల్లో ఎండ కారణంగా భక్తులకు కాళ్లు కాలుతున్నాయి. తగిన ఏర్పాట్లు చేయండి

ఈవో ` కాళ్ళు కాలకుండా వైట్‌ పెయింట్‌, మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాము.

11. మాలతి ` హైదరాబాద్‌

ప్రశ్న ` అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్‌లైన్‌లో కూడా తిరుమలలో ఇవ్వండి.

ఈవో ` తిరుమలలో ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల అధిక సమయం వేచి ఉండవలసి వస్తుంది. భక్తుల విజ్ఞప్తి మేరకే ఆన్లైన్లో విడుదల చేస్తున్నాము.

11. రత్నమ్మ` హైదరాబాద్‌

ప్రశ్న ` విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, సీనియర్‌ సేవకురాలిగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. సేవ చేయడానికి అవకాశం కల్పించండి.

ఈవో ` పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

12. భాస్కర్‌ ` కడప హరిబాబు ` దువ్వాడ

ప్రశ్న ` మార్చి నెలలో గది బుకింగ్‌కు యుపిఐ పేమెంట్‌ చేసాము. కానీ రసీదు రాలేదు. సాఫ్ట్వేర్‌ లో ప్రాబ్లం ఏర్పడుతోంది. గదులు ఖాళీ చేసే సమయంలో అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈవో ` భక్తులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి. ఎవరైనా అడిగితే విజిలెన్స్‌కి కంప్లైట్‌ చేయండి.

13. సీతారాములు ` ఖమ్మం

ప్రశ్న ` శ్రీవారి కల్యాణోత్సవం టికెట్‌ బుక్‌ చేసుకున్నాం. 14 సంవత్సరాల పైబడిన పిల్లలకి టికెట్‌ రాలేదు. వారిని అనుమతిస్తారా.

ఈవో ` 12 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా రూ.300 టికెట్‌ తీసుకునే దర్శనానికి వెళ్ళాలి.

14. వినయ్‌ ` మహబూబ్‌నగర్‌

ప్రశ్న ` తిరుమలలో జల ప్రసాదం నీరు సరిగా ఉండట్లేదు. ప్లాస్టిక్‌ బాటిల్‌ నిషేధించారు. భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఈవో` ప్రతిరోజు జలప్రసాద కేంద్రాల్లో నీటిని పరీక్షిస్తాము. డ్యామ్‌లోని నీటిని కూడా పరీక్షించిన తరువాతే సరఫరా చేస్తున్నాం. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద త్వరలో తక్కువ ధరకు భక్తులకు టప్పర్‌ వేర్‌, రాగి బాటిళ్ళను అందుబాటులో ఉంచుతాం.

15.పవన్‌ కుమార్‌ `విశాఖపట్నం

ప్రశ్న` తిరుమల ఆలయంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా తోపులాట చాలా ఎక్కువగా ఉంటోంది.

ఈవో` భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం

16. రాజేంద్రప్రసాద్‌ ` పులివెందుల

ప్రశ్న ` మూడు నెలలైనా కాషన్‌ డిపాజిట్‌ వెనక్కి రావడం లేదు.

ఈవో ` క్రెడిట్‌ , డెబిట్‌ కార్డ్‌ ద్వారా కాషన్‌ డిపాజిట్‌ చెల్లించి ఉంటే మూడు రోజులలో అదే అకౌంట్‌కి డబ్బులు జమ అవుతాయి.

17. పద్మారెడ్డి ` హైదరాబాద్‌

ప్రశ్న ` క్యూలైన్లలో అన్నప్రసాదాలు, టీ ఇవ్వడం లేదు.

ఈవో ` నిరంతరం సరఫరాచేస్తున్నాం.

18. అశోక్‌ కుమార్‌ `హిందూపురం

ప్రశ్న ` నడిచి వెళ్ళే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయండి.

ఈవో ` దివ్యదర్శనం టోకెన్లు జారీపై సర్వే నిర్వహించి, విధి విదానాలు ఖరారు చేస్తాం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.