SAVE POWER IN TIRUMALA- TTD EO _ తిరుమలలో విద్యుత్ ఆదా చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి భక్తులకు విజ్ఞప్తి

CREATE HOSPITALITY WING FOR DEVOUT SERVICE

Tirumala, 2 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy on Sunday directed officials to create awareness among devotees staying in Rest houses, Cottages and PACs at both Tirumala and Tirupati to support TTD drive to conserve power.

Addressing a review meeting at Sri Padmavati Rest House in Tirupati on Sunday the TTD EO asked officials to constantly educate devotees to switch off all power lines while vacating rooms.

He urged officials to study power consumption after installing new meters at all cottages. The SVBC and all publicity media should be utilised to spread awareness among devotees via media and the reception staff including FMS personnel should take responsibility on power conservation.

TTD HOSPITALITY WING TO PROVIDE QUALITY SERVICE TO DEVOTEES: EO

TTD EO directed officials to set up a Hospitality Wing to provide quality service at Tirumala and Tirupati to devotees coming for Srivari Darshan.

He asked officials to prepare a comprehensive report under the stewardship of Additional EO on facilities and services in coordination with the reception and other systems to provide satisfactory services to devotees.

TTD Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Nageswar Rao, SEs Sri Jagadishwar Reddy, Sri Venkateswarulu, DE Sri Ravishankar Reddy and reception officials of both Tirumala and Tirupati were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో విద్యుత్ ఆదా చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి భక్తులకు విజ్ఞప్తి

 తిరుమల, 2022, జనవరి 02: తిరుపతి, తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పిఏసిల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గదుల నుంచి బయటకు వచ్చే సమయాలలో భక్తులు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ ఆదా చేసేలా సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం విశ్రాంతి గృహాలు, పిఏసీలు తదితర ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో పలు కాలేజీలకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామని, కొత్త మీటర్లు ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత కరెంట్ వాడకం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. తద్వారా కరెంటు ఆదాపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఎస్వీబీసీ, ఇతర ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రిసెప్షన్ సిబ్బందితోపాటు ఎఫ్ఎంఎస్ సిబ్బంది కరెంట్ ఆదాపై బాధ్యత తీసుకోవాలన్నారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు హాస్పిటాలిటీ వింగ్ : ఈఓ

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల, తిరుపతిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకంగా హాస్పిటాలిటీ వింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో పాటు రిసెప్షన్ విభాగంతో ఎలా సమన్వయం చేసుకోవాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందించాలి అనే అంశాలతో అదనపు ఈవో ఆధ్వర్యంలో సమగ్ర సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, తిరుమల, తిరుపతి రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.