TTD CHAIRMAN APPEALS TO VIPs ON V DAY DARSHAN _ వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు పంపొద్దు

– DON’T SEND RECOMMENDATION LETTERS

– VAIKUNTA EKADASI DWARA DARSHAN FOR SELF-VIPs ONLY

– SUPPORT TTD DECISION FOR COMMON DEVOTEES

 Tirumala, 2 January 2022:  TTD Chairman Sri YV Subba Reddy has appealed to all VIPs not to send any recommendation letters for Vaikunta Ekadasi/Dwadasi darshans.

He asked VIPs to understand and support TTD decision to provide hassle free Vaikunta Ekadasi and Dwadasi darshan to common devotees who bought online tickets.

He said for ten days no recommendation letters will be accepted at the Chairman office.

He said in view of ongoing repairs to many cottages and rooms in Tirumala, accommodation for all legislators are organised at Nandakam and Vakulamatha rest houses and if the accommodation in Tirumala is not sufficient enough they should come prepared to make halt at Tirupati itself, he added.

TTD Chairman said SRIVANI trust devotees should take rooms at Madhavam, Srinivasam, Sri Padmavati Nilayam and SV guest house in Tirupati.

He said the TTD board has decided to reduce the VIP darshans during 10 day Vaikuntadwara darshan as much as possible and provide more for common devotees and accordingly instructions issued to officials.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు పంపొద్దు
– వి ఐ పి లు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తాం
– సామాన్య భక్తుల ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోండి
– వి ఐ పి లకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి

తిరుమల 2 జనవరి, 2022: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమల లో ని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే తిరుపతి లోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపి ల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది