SUNDRAKANDA PATHANAM COMPLETES 100 DAYS _ తిరుమలలో సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు

Tirumala, 18 Sep. 20: The prestigious Sundarakanda Pathanam in Nada Neerajanam platform has successfully completed 100 days stint on Friday.

It may be mentioned here that, TTD has mulled a series of dharmic programmes during the lockdown period which included Dhanwantari Maha Mantra Parayanam, Yoga Vasisthyam, Veda Parayanam etc.seeking the well-being of humanity from the clutches of Corona COVID 19 Virus. As soon as the darshan of Lord Venkateswara has been resumed to pilgrims almost after 80 days from June 11 on wards, TTD has commenced Sundarakanda Pathanam. 

The 68 Chapters of Sundarakanda comprises of 2821 Slokas. The programme which is telecasted live on SVBC between 7am and 8am every day has been receiving huge reception from the devotees across the globe. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు

విశ్వవ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 18: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుండి కాపాడి మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న సుంద‌ర‌కాండ పారాయణం శుక్ర‌వారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.  విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది.

టిటిడి ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో  సుంద‌ర‌కాండ పారాయ‌ణం 100వ రోజు 15వ స‌ర్గ పూర్తి చేసుకుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌ర్యా‌యాలు టిటిడి అఖండ పారాయ‌ణం నిర్వ‌హించింది. ఇందులో ప్ర‌థ‌మ స‌ర్గ నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 716 శ్లోకాల‌ను ప్ర‌ముఖ వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.  
 
మొదటగా “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైన విష‌యం విదిత‌మే.

ఎస్వీబీసీలో ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.