ALL GEARED UP TO CONDUCT SRIVARI ANNUAL BRAHMOTSAVAMS IN EKANTAM-TTD CHAIRMAN _ శ్రీ‌వారి ఆల‌యంలోనే శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు

Tirumala, 18 Sep. 20: All the arrangements are in place to conduct Srivari Annual Brahmotsavams from September 19 to 27 in Ekantam in view of COVID 19 restrictions, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Addressing media persons during a press conference held at Annamaiah Bhavan in Tirumala on Friday, the Chairman briefed them on the important days and events during the nine-day fete.

He said Ankurarpanam will be observed on September 18 between 6pm and 7pm while Dwajarohanam between 6.03pm and 6.30pm in the auspicious Meena Lagnam as fixed by the Agama pundits.

On Vahana Sevas he said, after consulting the Chief Priest and Agama Scholars, it has been decided to observe all morning and evening Vahana Sevas in Kalyanotsava Mandapam. Every day Morning Vahanam is observed between 9am and 10am

and Evening Vahanam between 7pm and 8pm while on Garuda Seva which occurs on September 23, the Vahana Seva will be observed between 7pm and 8.30pm. 

The same day, Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy will present the silk vastrams on behalf of AP Government to Srivaru on the day of Garuda Seva. 

This year, instead of the Swarna Ratham on September 24 and Wooden Chariot procession on September 26, Sarvabhoopala Vahanam will be conducted. On September 27 the annual Brahmotsavams concludes with Chakra Snanam. There will be live telecasting of all Vahana Sevas and special rituals in SVBC for the sake of devotees who are present globally. While the Public Relations Department will disseminate the information to the world via media”, he added.

TTD Chairman initially refused to enter into a political dialogue at Holy shrine of Tirumala but was pressed by the media to respond on charges made by opposition leader and former CM Sri N Chandra Babu Naidu against AP CM Sri YS Jaganmohan Reddy and TTD.

On CAG:

He said Dr Subramaniam Swamy, Rajya Sabha MP has filed a PIL in high court seeking auditing on misappropriation of funds in TTD during TDP regime from 2014 to 2019 by an independent agency. When consulted the same with AP CM, he directed that not only the past regime, but also the financial activities of the current regime in TTD should be subject to auditing by CAG to have transparency. Following the directive of CM the TTD board has resolved for auditing by CAG for all annual financial activities.

ON EVANGELICAL CHARGES:

Seriously refuting the charges the Chairman said, no evangelical activity took place at Tirumala. In the issue of RTC bus tickets carrying other religion Yatra marks found at Tirumala, the printing of the tickets took place during the TDP regime only.  In the police enquiry it was also proved and action has also been taken against the miscreants.

ON RELEADING SPECIAL FUNDS TO VISAKHA SARADA PEETHAM:

No special grants have been given to Sharda Peetham but funds were given for Loka Kalyan programs as was done in past also to Sharada peetham. “TTD has been giving funds to nearly 30 religious mutts and institutions which have been doing their bit for the propagation of Hindu Sanatana Dharma”, he added.

ON AP CM NOT SIGNING DECLARATION FORM:

People of all religions who have faith and belief in Sri Venkateswara Swamy are coming for Srivari Darshan. 

ON CORRUPTION CHARGES:

The middlemen system and corruption entertained by the past TDP regime, has totally eradicated now in Tirumala.  

Reacting on the allegations related to the temple, TTD EO Sri Anil kumar Singhal said the SVBC could not give live telecast Sri Ram Mandir Bhumi puja at Ayodhya on August 5 as the event time clashed with Srivari Nitya Kalyanotsava Seva which is telecasted live and witnessed by millions across the world. However, he said, the Bhumi Puja event was displayed well in the News bulletin and also a special program on SVBC later.

Over the charges on Hundi cloth, the EO said, Srivari temple hundi will be changed soon after the Hundial gets filled with the offerings by devotees.

Chief Priest Sri Venugopala Deekshitulu, Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti and SVBC CEO Sri Suresh Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలోనే శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు

– 23న స్వామివారికి సిఎం ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

మీడియా స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 18 సెప్టెంబరు 2020: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య అంకురార్ప‌ణ జ‌రిగిందని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంట‌ల మ‌ధ్య‌ మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. ఈ నెల 23వ తేదీ గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందువ‌ల్ల గ‌రుడ‌సేవ రోజు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించాల‌ని తాము కోరినందువ‌ల్లే సిఎం ఆరోజు వ‌స్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధానాంశాలు ఇవి.

–  బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తాం. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది.

– 24వ తేదీ ఉద‌యం ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంత‌రం ఉద‌యం 7 గంట‌ల‌కు నాద‌నీరాజ‌న వేదిక మీద జ‌రిగే సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్ణాట‌క స‌త్రాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రులిద్ద‌రు భూమిపూజ చేస్తారు.

– ఈసారి స్వ‌ర్ణ‌ర‌థం, ర‌థ‌రంగ డోలోత్స‌వం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది.

– ఈ నెల 27వ తేదీన చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

– తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భ‌‌క్తులు భ‌క్తితో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు.

– ఈ ఏడాది కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాల‌క‌మండ‌లి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.

– స్వామివారికి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ఫొటోలు అందిస్తాం.

సిఎం ఆదేశం మేర‌కే కాగ్ ఆడిటింగ్‌

– మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల టిటిడి మీద, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీద చేసిన ఆరోప‌ణ‌ల గురించి విలేక‌రులు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డిని ప్ర‌శ్నించారు.

– తిరుమ‌ల‌లో రాజ‌కీయాంశాలు మాట్లాడ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న తిర‌స్క‌రించారు. మాజీ ముఖ్య‌మంత్రి టిటిడికి సంబంధించిన అంశాల‌పైనే ఆరోప‌ణ‌లు చేసినందువ‌ల్ల స్పందించాల‌ని విలేక‌రులు కోరారు.

– గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో టిటిడిలో జ‌రిగిన నిధుల దుర్వినియోగం, అవ‌క‌త‌వ‌క‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని సంస్థ‌తో ఆడిటింగ్ చేయించాల‌ని ఎంపి శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హైకోర్టులో పిల్ వేశార‌ని ఛైర్మ‌న్ చెప్పారు.

– ఈ విష‌యం గురించి తాను ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌పుడు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా జ‌రిగిన నిధుల ఖ‌ర్చుపై కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల‌ని సిఎం ఆదేశించారు.

– పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని సిఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు టిటిడి నిధుల వ్య‌యంపై కాగ్ ఆడిటింగ్ జ‌రిపించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీర్మానం చేశాం.

– గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో జ‌రిగిన ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను, అవినీతిని తాము పూర్తిగా నిర్మూలించాం.

– తిరుమ‌ల‌లో ఎలాంటి అన్య‌మ‌త ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో నెల్లూరు ఆర్‌టిసి డిపోలో ముద్రించిన అన్య‌మ‌త ప్ర‌చార టికెట్ల‌ను కుట్ర‌పూరితంగా తిరుమ‌ల‌కు పంపిన విష‌యం విచార‌ణ‌లో తేలింది. దీని మీద పోలీసు కేసు కూడా న‌మోదైంది.

– మ‌ఠాలు లోక‌క‌ల్యాణం కోసం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు నిధులు ఇచ్చే సంప్ర‌దాయం గ‌తంలో కూడా ఉంది. ఇత‌ర మ‌ఠాల‌కు ఇచ్చిన విధంగానే శార‌దా పీఠం కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆర్థిక‌సాయం చేశాం. ఈ మ‌ఠానికి మాత్ర‌మే ప్ర‌త్యేకంగా నిధులివ్వ‌లేదు.

– తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద న‌మ్మ‌కం, భ‌క్తి ఉన్న అనేక‌మంది ఇత‌ర మ‌తాలకు చెందిన వారు ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు.

–  కోవిడ్‌-19 నేప‌థ్యంలో టిటిడి ఆదాయం త‌గ్గినా స్వామివారి కైంక‌ర్యాలు, ఆగ‌మ కార్య‌క్ర‌మాలు ఎలాంటి లోటు లేకుండా కొన‌సాగుతున్నాయి.

– కోవిడ్ ఇబ్బందుల వ‌ల్ల బ్యాంకులు వ‌డ్డీ త‌గ్గించ‌డంతో గ‌తంలో టిటిడి డిపాజిట్ల మీద 9 శాతం దాకా వ‌చ్చే వ‌డ్డీ ప్ర‌స్తుతం 4.5 శాతానికి త‌గ్గింది. డిపాజిట్ల మీద అధిక వ‌డ్డీ ల‌భించేలా చేయాల‌నే ఉద్దేశంతోనే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆర్‌బిఐ గ్యారంటీ ఉంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సెక్యూరిటీ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచించాం.

టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ :

– అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్న స‌మ‌యంలో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం లైవ్ ఉన్నందువ‌ల్ల ఎస్వీబీసీ ఆ కార్య‌క్ర‌మాన్ని లైవ్ ఇవ్వ‌లేక‌పోయింది.

– ఆ త‌ర్వాత వార్త‌ల్లోను, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోను ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌సారం చేసింది.

– శ్రీ‌వారి ఆల‌యంలో హుండీ నిండిన త‌రువాతే కొత్త వ‌స్త్రం మార్చ‌డం జ‌రుగుతుంది.

– ఈ ఏడాది డిసెంబ‌రుకు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు కాల‌ప‌రిమితి ముగుస్తుంది. ఆ త‌రువాత అధిక వ‌డ్డీ వ‌చ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌స్తాం.

– పెర‌టాసి మాసం ర‌ద్దీ వ‌ల్ల తిరుప‌తిలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు జారీ చేసే కౌంట‌ర్ల వ‌ద్ద కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రుగుతున్నందువ‌ల్లే ఆ టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాం. ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక వీటిని పున‌రుద్ధ‌రిస్తాం.

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు :

–  కోవిడ్ నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం.

– చ‌క్ర‌స్నానానికి సంబంధించి ఆల‌యంలోనే ఏర్పాట్లు చేశాం. అయినా, అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాం.

– అష్ట‌దిక్పాల‌కుల‌కు జ‌రిగే ఉప‌చారాలు, బ‌లి, నైవేద్యాల స‌మ‌ర్ప‌ణ ఆల‌య ప్రాకారంలోనే నిర్వ‌హిస్తాం.

ఈ మీడియా స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌,  సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.