SRI PAT BTUs ON PAR WITH TIRUMALA BTUs_ తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tiruchanoor, 21 Oct. 19: The arrangements for the annual Karthika brahmotsvams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor should be carried out on par with Tirumala Srivari brahmotsavams, said JEO Sri P Basant Kumar.

The JEO reviewed on the action plan by various departments for the big event which is slated to commence from November 23 onwards at Asthana Mandapam in Tiruchanoor. The engineering works including barricading works and other related civil works, electrical works etc. should be completed within the stipulated time. He directed the concerned to pay special attention while erecting electrical arches, LED screens, PA System etc.

He instructed the HDPP Secretary Sri Rajagopalan to first test the art forms before they are selected to perform before vahanams. The floral decorations should be more attractive for the annual fete, he said. He directed the concerned to coordinate with the police, panchayat and revenue officials to make elaborate security and other arrangements for the mega religious festival which is scheduled from November 23 to December 1. 

Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy, CE Sri G Ramachandra Reddy, ACVSO Sri Sivakumar Reddy, SE Sri Venkateswarulu, GM Transport Sri Sesha Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుప‌తి,  2019 అక్టోబ‌రు 21:  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థాన‌మండ‌పంలో జెఈవో సోమ‌వారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ న‌వంబ‌రు 23 నుంచి డిసెంబ‌రు 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను మొద‌ట ప‌రిశీలించిన త‌రువాత మాత్ర‌మే ఎంపిక చేయాల‌న్నారు.  భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.

శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని జెఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని, తోళప్ప గార్డెన్స్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు అధికారులు కృషి చేయాల‌ని కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డిఎస్పి శ్రీ టి.ముర‌ళీకృష్ణ, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రాజ‌గోపాల‌న్‌, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా|| సునీల్‌, ఏఈవో శ్రీసుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.